Pune fire incident death toll: పూణెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. సోమవారం రాత్రి వరకు ఫ్యాక్టరీలో సెర్చ్ ఆపరేషన్ (Search operation) నిర్వహించిన పోలీసులు, అగ్నిమాపక దళాలు పరిశ్రమలోంచి 18 మృత దేహాలు వెలికితీశారు.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు.
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దుర్ఘటన ఇంకా మరువక ముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో సాల్వెంట్ గోడౌన్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం ( Major fire accident ) చోటుచేసుకుంది.
Bharuch blast గుజరాత్‌లోని భరూచ్‌లో ఓ రసాయన కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి( Fire brokeout). ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. భరుచ్ జిల్లాలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని యశశ్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ( Yashashvi rayasan pvt ltd ) ఈ పేలుడు చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా భుసావల్ లోని ఓ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు నాలుగు అగ్ని మాపక బృందాలు ప్రయత్నించాయి.
ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాలు రూపంలో ఉపశమనం లభించిందని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.