TS Rains: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రంలో మరి రెండు రోజుల పాటు   తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది.  మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో సైతం ఆవర్తనం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రేపటికి తూర్పు - మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇలాంటి వాతావరణంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణలో కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గాలుల వేగం గంటకు 30-40 కి.మీ ఉంటుందని చెప్పారు.
ఈ రోజు హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మధ్యాహ్నం ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి వర్షం కురిసే అవకాశాలున్నాయి.  ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయన్నారు.  

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

బంగాళాఖాతంలో “దానా” తుఫాను దూసుకు వచ్చింది. దీని ప్రభావంతో ఈ రోజు నుచి మరో రెండు మూడు రోజుల పాటు  కొనసాగనుంది. ఈ తుపాను పశ్చిమ బెంగాల్ , ఒడిశా తీరాల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయా ప్రభుత్వాలను వాతావరణశాఖ అలర్ట్‌ చేసింది. మరో వైపు ఇండియన్ కోస్ట్ గార్డ్,తీర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులతోపాటు ప్రజలను  రక్షించడానికి అనేక చర్యలను చేపడుతోంది. సముద్రంలో. ICG పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. తుఫాను ప్రభావం నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా అత్యవసర పరిస్థితికి సంసిద్ధతను నిర్ధారించడానికి చురుకైన చర్యలు చేపట్టింది. తీరంలో చేపల వేటకు వెళ్ళ వద్దని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు హల్దియా, పారాదీప్‌లలో హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

English Title: 
Telangana Weather Report Strange Day by day due to dana toofan ta
News Source: 
Home Title: 

Telangana Rains: తెలంగాణలో చిత్ర విచిత్రమైన వాతావరణం.. ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

Telangana Rains: తెలంగాణలో చిత్ర విచిత్రమైన వాతావరణం.. ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..
Caption: 
Telangana Weather (X/Source)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తెలంగాణలో చిత్ర విచిత్రమైన వాతావరణం.. ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..
TA Kiran Kumar
Publish Later: 
Yes
Publish At: 
Wednesday, October 23, 2024 - 05:22
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Request Count: 
11
Is Breaking News: 
No
Word Count: 
325

Trending News