India vs South Africa 3rd Test Day 3 Highlights : దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆతిథ్య జట్టువైపే విజయం సాధించే అవకాశాలు.
IND vs SA 3rd Test: మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పంత్ శతకంతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లులో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
India vs South Africa 3rd Test Day 2 Highlights, India leads by 70 runs : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రసవత్తరంగా మారుతోన్న ఆఖరి టెస్ట్ మ్యాచ్. మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసిన భారత్. 70 రన్స్‌తో లీడ్‌లో కొనసాగుతోన్న టీమిండియా.
IND Vs SA 3rd Test: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కొనసాగుతున్నాడు.
India vs South Africa: ఇండియా- దక్షిణాఫ్రికా కీలకమైన, చివరి టెస్ట్ ఇవాళ ప్రారంభం కానుంది. చెరో టెస్టు విజయాలతో సమ ఉజ్జీగా ఉన్న టీమ్ ఇండియా, సౌత్ ఆఫ్రికాలకు ఇది కీలకం. మూడవ టెస్ట్ టీమ్ వివరాలు ఇలా ఉన్నాయి.
IND Vs SA 2nd Test: టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ గెలుపుతో టెస్టు సిరీస్ ను 1-1 తో సిరీస్ సమం చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో ఆ జట్టుకు విజయాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.
IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 58 పరుగుల ఆధిక్యం సంపాధించింది. శార్దూల్ 7 వికెట్లు తీసి అతిథ్య జట్టు వెన్నువిరిచాడు.
IND Vs SA 2nd Test: టీమ్ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 202 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది. సఫారీ జట్టు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది.
Rahul Dravid on Kohli: ఇండియన్ టీమ్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా కోహ్లీ కెప్టెన్సీపై చర్చలు జరుగుతున్నా.. కోహ్లీ అలాంటివి పట్టించుకోవడం లేదని అన్నాడు. ఆ సమయంలో కోహ్లీ వ్యవహరించిన తీరు హర్షణీయమని తెలిపాడు.
India vs South Africa: Team India's Lunch Menu Goes Viral : టీమిండియా రెండో రోజు లంచ్ సెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు హల్ చల్ చేస్తున్నాయి. ఆడడానికి ఎలాగో అవకాశం లేదు.. సరే.. తినడానికి మంచి మెనూ ఉంది..కానిద్దాం పదండి అన్నట్లుగా సోషల్ మీడియాలో టీమిండియాపై కొన్ని పోస్ట్స్ వైరల్ అయ్యాయి.
KL Rahul Vice Captain: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
IND Vs SA Test Series: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా తప్పక విజయం సాధిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత జట్టు గెలవని నేపథ్యంలో ఈసారి తాము విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టిస్తామని స్పష్టం చేశాడు.
IND Vs SA Test Series: డిసెంబరు నెలాఖరు నుంచి టీమ్ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ దూరం కానున్నాడు. అయితే అతడి స్థానంలో యువ క్రికెటర్ కు జట్టులో ఆడించే అవకాశం ఉందని సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతూ యాష్ వికెట్లు పడగొడుతున్నాడన్నాడు. అశ్విన్ ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్లు కొనసాగిస్తే.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కూడా బద్దలు కొడతాడని జహీర్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా తుది జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పక్కకుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్ వేశాడు.
మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం మంగళవారం (డిసెంబర్ 7) దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ డీన్ ఎల్గర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న టెంబా బావుమా.. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
IND Vs SA Series 2021 Schedule: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ద్వైపాక్షిక సిరీస్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా.. డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.