Guntur West Assembly Constituency: టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని బద్దలు కొట్టాలని అధికార పార్టీ పావులు కదుపుతుండగా.. వైఎస్ఆర్సీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు జనసేన దృష్టి పెట్టిందా..? ఆ బలమైన మహిళా నేతను ఎదుర్కొనేందుకు జనసేనే సరైన ఆయుధమని టీడీపీ భావిస్తోందా..? జనసేన అధినేత ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలను రచిస్తున్న ఆ నియోజకవర్గంలో ఏంటి అక్కడ జనసేన పార్టీకి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి..?
Pawan Kalyan Review Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు వ్యక్తిగతం 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
Pawan Kalyan On Volunteers: ఏపీలో వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇళ్లలోకి చొరబడి మరీ డేటాను సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ నేడు ప్రాణాలను కూడా తీస్తోందని అన్నారు.
Pawan Kalyan Meeting with NRI Gulf Members: రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
Janasena-TDP Alliance: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పటివరకు పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్.. తాజాగా ఇంకా సమయం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.
గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రాజోలులో నేడు జనసేన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. జనసేన ఓట్ల నుంచి గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు.
Pawan Kalyan Varahi Yatra: తాను ఎన్నికల ముందు అది చేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పనని తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అన్న జనసేనాని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.
Pawan Kalyan in Kondagattu : పవన్ కళ్యాణ్ తన వారాహితో కొండగట్టుకు వచ్చారు. కొండగొట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ పోరాట పటిమ గురించి మాట్లాడాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.