Telangana: పొలిటికల్ జిమ్మిక్కులు కుదరవు: హైకోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది. 

Last Updated : Jul 10, 2020, 07:17 PM IST
Telangana: పొలిటికల్ జిమ్మిక్కులు కుదరవు: హైకోర్టు

KCR: హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది. రాజకీయ జిమ్మిక్కులు మానుకోవాలని పిటిషనర్‌ని గట్టిగా హెచ్చరించింది. Also read: Telangana: కొత్త సచివాలయంలో ఆలయం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్

ఈ పిటిషన్‌ను విచారించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్‌ని హైకోర్టు ధర్మాసనం తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఒకవేళ ముఖ్యమంత్రి కనిపించని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. Also read: సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేకులు

కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర పజలు ఆందోళన చెందుతున్నారని ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ధర్మాసనాన్ని కోరిన సంగతి తెలిసిందే. Also read: Vikas Dubey encounter: మౌనమే మేలు: రాహుల్ గాంధీ

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News