Manchu Manoj: గత కొద్దిరోజులుగా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక మరోసారి మోహన్ బాబు రెండో కుమారుడు..మంచు మనోజ్ తన కుటుంబం మీద జరిగిన అవాంఛనీయ సంఘటనను వ్యక్తపరిచి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. డిసెంబర్ 14న, తన ఇంటిలో కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే కుట్ర జరిగిందని.. ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన తీవ్రంగా చలించిపోయినట్లు తెలిపారు.
మనోజ్ ప్రకటన ప్రకారం, సంఘటన జరిగిన రోజున.. అనగా నిన్న.. ఆయన షూటింగ్‌లో ఉండగా, ఆయన భార్య తమ కుమారుడి పాఠశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన సోదరుడు విష్ణు మంచు తన సహచరులు రాజ్ కొండూరు, కిరణ్ (ఇప్పటికే చోరీ కేసులో నిందితుడు), విజయ్ రెడ్డి, మరికొంత మంది బౌన్సర్లతో కలిసి ఆయన ఇంటికి వచ్చారు. కాగా వారందరూ.. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి వచ్చాము అనే పేరుతో ఇంటిలోకి ప్రవేశించారు.
అయితే, వారు చేసిన చర్యలు ప్రమాదకరమైనవిగా మారాయి అని మనోజ్ పేర్కొన్నారు. ఇంటి ప్రధాన జనరేటర్లలో చక్కెర కలిపిన డీజిల్ పోసి, ఉద్దేశపూర్వకంగా జనరేటర్ల పనితీరును పాడు చేశారు. దీనివల్ల రాత్రి జనరేటర్లు విఫలమై విద్యుత్ సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి అని తెలిపాడు.
Also Read:Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?
ఇంటి దగ్గర వాహనాలు ఉండటం, గ్యాస్ కనెక్షన్లు సక్రియంగా ఉండటంతో ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ముందే తట్లు వారు.. క్రియేట్ చేశారు అని మనోజ్ చెప్పారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఆయన తల్లి, 9 నెలల పసికందు, ఆయన మామయ్య, అత్తయ్య కూడా ఉన్నారు అని మనోజ్ పేర్కొన్నారు.
ఇంకా వెళ్లిపోయే ముందు, విష్ణు, అతని బృందం.. తన ఇంట్లో ఉన్న లాయల్ సిబ్బందిని బలవంతంగా తీసుకెళ్లి.. కుటుంబాన్ని ఒంటరిని చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన డంగల్ కోచ్‌ను బెదిరించి, అతనికి, అతని కుటుంబానికి హాని చేస్తామంటూ హెచ్చరించారని తెలిపారు.
ఇది కొత్త సంఘటన కాదని, గతంలో కూడా ఇదే తరహా బెదిరింపులు జరిగాయని, అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మనోజ్ వాపోయారు. ఈ ఘటన తన తల్లి పుట్టినరోజున జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. కుటుంబం ప్రాణభయంతో జీవిస్తున్నామని, పోలీసులు న్యాయం చేయాలని మనోజ్ విజ్ఞప్తి చేశారు.
మంచు కుటుంబ వివాదాలు గతంలో కూడా వార్తల్లో నిలిచాయి. ఈ తాజా సంఘటన మాత్రం మరింత తీవ్రతను చూపిస్తోందని కొంతమంది వాదిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం.. మనోజ్ కావాలనే మోహన్ బాబు, విష్ణు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనిపిస్తుందని వాపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.