మంత్రి కేటీఆర్ ( Minister KTR ) జలుబుతో బాధపడుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ జలుబుతో బాధపడటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సేవలో ముందున్నారు.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ కారణంగా దేశంలో చాలా కంపెనీలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయని... తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని పలు వాణిజ్య సంస్థలు, ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతుండటం నిత్యం వార్తల్లో చూస్తున్నదే. ఈ ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపిస్తూ సంస్థలు ఎక్కడ తమని ఉద్యోగంలోంచి తీసేస్తాయోననే ఆందోళన ఐటి నిపుణులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను వేధిస్తోంది.
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు సంబంధించి పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడిన ఆ పరీక్షల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఘాటైన హెచ్చరికలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతూ... ఇకపై పని చేయకపోతే పదవులే పోతాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి జగదీష్ రెడ్డిని మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు పరామర్శించారు.
#AskKtr (ఆస్క్ కేటీఆర్) అనే హ్యష్ ట్యాగ్‌తో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు నెటిజెన్స్‌తో కాసేపు సరదాగా చిట్ చాట్ చేశారు. రాష్ర్టంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు నుంచి ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన వరకు అనేక కీలక అంశాలు ట్విటర్లో చర్చకొచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన బాన్సువాడలో రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు శనివారం పర్యటించారు.
ఐటి ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రధాన రద్దీ ప్రాంతమైన హైటెక్ సిటీ-రాయదుర్గం మార్గంలో 1.5 కీ మీ మేర మెట్రో మార్గాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రి కేటీఆర్‌ను కలిసిన కపిల్ దేవ్.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎటువంటి ఆహ్వానం అందకుండానే మంత్రి కేటీఆర్ అక్కడకు వెళ్లారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటైన రిప్లై ఇచ్చారు. తనకు ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి అందిన ఆహ్వానం లేఖలని జతపరుస్తూ ఓ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ లోనే కాంగ్రెస్ నేతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ గారూ.. తానేమీ పప్పుని కాదని, హుందాగా మీ ( ఉత్తమ్ కుమార్ రెడ్డి) తప్పు మీరు తెలుసుకుని సరిదిద్దికుంటారని ఆశిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.