అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుస్తున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ..డ్రీమ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం 'ది స్టాచ్యూ ఆఫ్ యునిటీ'ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మరో డ్రీమ్ ప్రాజెక్టు రెడీ అయింది.
ఫిబ్రవరి 16న ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకరోజు పర్యటనలో బాగంగా పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన భారతీయ జనతా పార్టీపై, శివసేన ఘాటైన విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదని, అమిత్ షా వ్యూహరచన విఫలమైందని మండిపడింది.
దశాబ్దాల కాలం నాటి రామ్ జన్మభూమి అంశం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పం, పట్టుదలను సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెనర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఆర్ధిక మందగమనంపై మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానికి ఆ ధైర్యం లేదు అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు
గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులతో హ్యాపీగా ఉన్నట్లయితే ఆప్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు. సీఏఏ ఢిల్లీ ఓటర్లను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, దేశ రాజధాని ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
జేఎన్‌యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.