కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఉంది. వ్యాక్సిన్ సిద్ధమైతే..పంపిణీ కోసం దేశం సిద్దంగా ఉందా..80 వేల కోట్లున్నాయా అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాక్సిన్ కోసం మరో భారతీయ కంపెనీ సిద్ధమౌతోంది. దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల నిలిపివేతపై మరో భాగస్వామ్య కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. భారత్ లో ప్రయోగాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నాయి. అందరి దృష్టి మాత్రం ఒక్క ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కరోనావైరస్ ( Coronavirus) ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందుల్లోకి నెట్టింది. లక్షలాది మంది మరిణించారు. భారత దేశంలో 33 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ వ్యాక్సిన్ కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ( 3rd Phase Trials ) మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford Vaccine ) వ్యాక్సిన్ తుది ట్రయల్స్ ను ఇండియాలో ఆగస్టు నెలలో జరపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రపంచం ఎదురుచూస్తున్న ఆక్స ఫర్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న ఇండియన్ కంపెనీ ఆ కీలక విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్ ఉత్పత్రిలో 50 శాతం భారత్ కే కేటాయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.