మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
కరోనావైరస్కి (Coronavirus) వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటంలో రానున్న రెండు వారాలు చాలా కీలకమైనవి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harshavardhan) అన్నారు.
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సర్కార్ (Telangana govt) సైతం అప్రమత్తమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నేడు అసెంబ్లీలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశంలో 65 మందికి కరోనా వచ్చిందని.. అందులో 17 విదేశీయులు ఉన్నారని తెలిపారు.
ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ దేశంలో క్రమ క్రమంగా వ్యాప్తి పెరుగుతూపోతోంది. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అని తేలడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మొత్తంలో అప్రమత్తమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఢిల్లీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో జరిగిన యూనియన్ సమావేశంలో సభ్యులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అరుదైన గౌరవం దక్కింది.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధుల మంజూరీకి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు గత ఐదేళ్లల్లో ఇచ్చిన నిధులపై గణాంకాలు విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడింది.
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC) అమలు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం కానీ లేదా జాతీయ పౌర జాబితా కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదని చెబుతూ.. సీఏఏ, ఎన్ఆర్సీలకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ముస్లింలు అర్థం చేసుకోవాలని సూచించారు.
టిఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల పలు వరాలు గుప్పించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా వారికి క్రిస్మస్ పర్వదినం నాడే మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇదివరకే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఉండగా తాజాగా బుధవారం నాడు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రకటన ఇక అధికారికంగా అమలులోకి వచ్చినట్టయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఉదయం 11 గంటలకు ములుగు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు.
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనపై జేఏసీ కన్వినర్ అశ్వథామ రెడ్డి స్పందించారు. అశ్వత్థామ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.
తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున 1985 నుంచి 1994 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యాదగిరి రెడ్డి నిరాడంబరుడనీ, చివరివరకూ ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) 47 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఓ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.