కొవిడ్-19 నేపథ్యంలో తమకు రావాల్సిన వేతనాలు బకాయి పడటంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని ఇక తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
Cinema city of Hyderabad: హైదరాబాద్: నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో 1500-2000 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) ప్రకటించారు. సినీ ప్రముఖులతో పాటు సంబంధిత అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని ( Cinema city in Bulgaria ) పరిశీలించిన అనంతరం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Telangana CM KCR launches Dharani Portal | రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో నేటి మధ్యాహ్నాం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.
CM KCR condolences over Naini Narsimha Reddys Death | తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR condolences over Naini Narsimha Reddys Death) వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ (TRS) పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Rains and floods in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూసిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ( Ram vilas paswan died ) తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళి అర్పించారు. లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. తెలంగాణ ఉద్యమం సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ ఉద్యమానికి మద్దతు పలికారని గుర్తుచేసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపధ్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎవరికి అనుకూలమైంది..ఎవరికి కాదనే విషయం పక్కన బెడితే..తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే...వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు సహా ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఇకనైనా ఆపాలని.. లేదంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బాబ్లీ తరహాలో బ్యారేజీ నిర్మించి తీరుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద తెలంగాణ సర్కార్ బ్యారేజీ నిర్మించడం జరిగిందంటే, అందులోంచి రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ( Chandrababu Naidu ) తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కేసిఆర్ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.
Revanth Reddy open letter to CM KCR: హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ( Revanth Reddy to CM KCR ) ద్వారా ఘాటైన హెచ్చరికలు చేశారు. నాగులు ఆత్మహత్యాయత్నం ఘటనకు ( Nagulu suicide attempt issue ) దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు ఘాటైన పదజాలంతో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
భారతదేశ మాజీ ప్రధాని ( Indian Ex Pm ) పీవీ నరశింహారావు ( Pv Narasimha rao ) కు బారత రత్న పురస్కారం కోసం తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం రానుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పీవీకు సంబంధించిన మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సినీ ప్రముఖులు కలిసిన అనంతరం చిరంజీవి-బాలయ్య బాబు మధ్య ఓ వివాదం చెలరేగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో భూములు పంచుకోవడానికి వెళ్లారా అనే వ్యాఖ్యలు సైతం చేశారు.
శ్రీశైలం అగ్నిప్రమాద ( Srisailam Fire Accident ) మృతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన డీఈ కుటుంబానికి 50 లక్షలు..మిగిలినవారికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ( Telangana government ) వెల్లడించింది.
శ్రీశైలం విద్యుత్ కేంద్రం ( Srisailam power plant ) లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ( Srisailam left canal ) జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు అధికార్లు ధృవీకరించారు. మొత్తం 9 మంది చిక్కుకుపోగా...ఆరుగురు మృతి చెందినట్టు నిర్ధారించారు. అటు జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ ( CID probe ) కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.