ట్రంప్‌కు కేసీఆర్ కానుకలివే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. 

Last Updated : Feb 25, 2020, 01:39 PM IST
ట్రంప్‌కు కేసీఆర్ కానుకలివే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.  ఈ విందుకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్ ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఆయనకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయన విందుకు హాజరవుతున్నారు.  

హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ .. విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. ట్రంప్ గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొంటారు. అంతే కాదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బహుమతులు తీసుకువెళ్తున్నారు. డోనాల్డ్ ట్రంప్‌ను ఆయన పోచంపల్లి శాలువాతో సత్కరిస్తారు. చార్మినార్ జ్ఞాపికను అందజేస్తారు. అదే విధంగా ట్రంప్ సతీమణి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ గారాపట్టి ఇవాంక  ట్రంప్‌కు కూడా పోచంపల్లి చీరలు బహుకరిస్తారు. తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండే గుర్తులను వారికి ఇవ్వనున్నారు. 

మరోవైపు గతంలో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నప్పుడు కూడా ఆమెకు తెలంగాణ తరఫు నుంచి మంచి బహుమతులు లభించాయి. అప్పట్లో ఆమెను మంత్రి కేటీఆర్ గొల్లబామ చీరతో సత్కరించారు.

Trending News