అపెక్స్ కౌన్సిల్ ( Apex council ) సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వాగతించారు. నదీ జలా వినియోగం విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాల సందేహాల్ని నివృత్తి చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ నియామకపత్రాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. అనంతరం సంతోష్ బాబు కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్ర కొత్త సచివాలయం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే మీడియాలో వైరల్ అవుతున్న మోడల్ కు ఆమోదం లభిస్తుందా లేదా కొత్తది సిద్ధమవతుందా? కొత్త సచివాలయం ( New Secretariat ) డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష( KCR Review ) నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్ ( Modi speaks with Ap, Telangana Cms ) లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి.
కరోనా సంక్రమణ భయం అంతకంతకూ పెరుగుతోంది. ఎవర్నీ ఖాతరు చేయకుండా విస్తరిస్తున్న ఈ మహమ్మారి వీవీఐపీలకు దడ పుట్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న తెలంగాణలోని ప్రగతి భవన్ ...ఇప్పుడు ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం. రెండింటా కరోనా కేసులు నిర్దారణ కావడంతో ఆందోళన ఎక్కువైంది.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narsimha Rao centenary birth celebrations ) శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా పీవీ సేవల్ని కొనియాడారు.
Harithaharam 6th Phase: తెలంగాణ ముఖ్యముంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అభివృద్ధిలో మిగితా రాష్ట్రాల కన్నా మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ఆరవ విడత హరితహారం (6th Phase Of HarithaHaram) కార్యక్రమాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
CM KCR meets Colonel Santosh Babu`s family: సూర్యాపేట: ఇండో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ( Colonel Santosh Babu ) కుటుంబసభ్యుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Rythu bandhu scheme money | హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయం రాష్ట్రంలోని రైతులు అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్‌లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.
Bandi Sanjay Kumar: హైదరాబాద్: కొందరు వ్యక్తుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమకు నచ్చినట్టుగా కొందరు వ్యక్తుల కోసం ఏకంగా జీవోలు జారీ చేయడం అనేది ప్రభుత్వం దిగజారుడుతనానికి ఓ నిదర్శనం అని ఆయన తెలంగాణ సర్కార్‌పై ( Telangana govt ) మండిపడ్డారు.
Traffic Challan | హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియజేసేందుకు ఈ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని TS 09 K 6666 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ ప్రాడో కారుకు వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.