ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో పిల్ఖువ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిల్ఖువ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగింది.
"మేము అధికారం చేపట్టాక నేరగాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించాం. వారి మీద అనేక ఆంక్షలు పెట్టాం. ఇప్పుడు వారికున్నవి రెండే దారులు. ఒకటి జైలుకైనా వెళ్లాలి లేదా ఎంకౌంటర్ లో ప్రాణాలైనా వదలాలి" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ సర్దానా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ దిగ్గజ స్మారక చిహ్నం తాజ్ మహల్ పై మరొక వివాదానికి తెరలేపారు. ప్రపంచ ప్రఖ్యాత స్మారక కట్టడాన్ని "ద్రోహులు నిర్మించారని, భారతీయ చరిత్రలో భాగం కాదని" అన్నారు.
"యుపి పర్యాటక బుక్లెట్ నుండి తాజ్ మహల్ ను తొలగించారని చాలా మంది నిరాశ చెందారు. మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం? తాజ్ మహల్ సృష్టికర్త తన తండ్రిని ఖైదు చేశాడు. అతను హిందూలను తుడిచివేయాలని కోరుకున్నాడు. ఇలాంటి ప్రజలు మన చరిత్రలో భాగమైతే, అంతకంటే విచారం మరేదీలేదు. మేము ఈ చరిత్రను మారుస్తాము" అని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.