45 మంది పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ కుంటలో బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది చిన్నారులు గాయపడినట్టు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌కి సమీపంలోని ఖైరా గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడిన కుంటలో నీళ్లు ఉండటంతో గాయపడిన చిన్నారుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి ప్రాణహాని ఉందని.. మిలిటెంట్లు కొందరు సీఎంను టార్గెట్ చేస్తున్నారని తమకు సమాచారం అందిందని మధ్యప్రదేశ్ పోలీస్ వర్గాలు తెలిపాయి.
సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఒక్క నిముషంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలనని.. కాకపోతే తనకు అంత ఆశ లేదని.. ఎప్పుడైతే తాను సీఎం అవుతుందో
అప్పుడే తన స్వాతంత్ర్యం పోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో కేంద్ర ఆరోగ్య, కుంటుంబ సంక్షేమశాఖ మంత్రి అనుప్రియ పటేల్ కు యూపీలో చేధు అనుభవం ఎదురైంది. కొందరు ఆకతాయిలు ఆమె కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన వారణాసిలోని మిర్జామురాద్ సమీపంలో చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.