Iphone 15 Charger: ఐఫోన్ 15తో పాటు 150W ఛార్జర్ కూడా ఫ్రీగా లభించబోతోందా?

Apple 15 Charging Port Free India: త్వరలో విడుదల కాబోయే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ తో పాటు 150W ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్‌ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఐఫోన్ 15 తో పాటు చార్జర్ వస్తుందా?

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2023, 08:10 PM IST
Iphone 15 Charger: ఐఫోన్ 15తో పాటు 150W ఛార్జర్ కూడా ఫ్రీగా లభించబోతోందా?

 

Apple 15 Charging Port Free India: యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్ కి మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు కంపెనీ  ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది.  గత సంవత్సరంలో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కి మంచి ప్రాముఖ్యత లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని యాపిల్ కంపెనీ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. కంపెనీ ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ను గత నెలలోనే ప్రారంభించాల్సింది. కానీ డిస్ప్లే లోని మార్పుల చేర్పుల కారణంగా విడుదల తేదీల్లో మార్పులు వచ్చాయని అందరికీ తెలిసిందే. 

మార్కెట్లో ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ లకు మధ్య గట్టి పోటీ జరుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్ల ఫీచర్స్ ను పోల్చుకొని మరి కస్టమర్లు మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఇక యాపిల్ స్మార్ట్ ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఇప్పటికి ఎంతో వెనుకబడిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాటరీ పరంగా ఐఫోన్ ఎంతో వెనకబడి ఉంది. యాపిల్ కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ఛార్జింగ్ అందించేందుకు సీ టు సీ టైప్ కేబుల్ చార్జర్ ను అందించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఐఫోన్ 15 తో పాటు 150W ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ అందించబోతున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

గత సంవత్సరంలో విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 14 తో కంపెనీ గరిష్టంగా 30W ఛార్జింగ్ కేబుల్ ను అందించగా.. ఐఫోన్ 15 లో వస్తున్న చార్జింగ్ కేబుల్ దీనికి ఐదు రెట్లు పనిచేస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు ఈ మొబైల్ ఫోన్ తో వచ్చే USB-C కేబుల్ ద్వారా ఫోన్లోని డేటాను హై స్పీడ్ లో బదిలీ చేసుకోవచ్చట. అంతేకాకుండా ఈ కేబుల్ గరిష్టంగా 150W పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని ఫీచర్ల వివరాలు కంపెనీ అధికారికంగా విడుదల చేసేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News