Iqoo Z9 5G Price Offers: 128GB స్టోరేజ్‌ Iqoo Z9 5G మొబైల్‌పై భారీ ఆఫర్స్‌ ప్రకటించిన అమెజాన్‌.. పూర్తి వివరాల కోసం..

Iqoo Z9 5G Price Bank Offers: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో iQOO స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ iQOO Z9 5G మోడల్‌తో లాంచ్‌ చేసింది. అయితే ఇది అమెజాన్‌లో మార్చి 14 నుంచి అందుబాటులోకి రానుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 13, 2024, 11:58 AM IST
Iqoo Z9 5G Price Offers: 128GB స్టోరేజ్‌ Iqoo Z9 5G మొబైల్‌పై భారీ ఆఫర్స్‌ ప్రకటించిన అమెజాన్‌.. పూర్తి వివరాల కోసం..

Iqoo Z9 5G Price Bank Offers: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ iQOO మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. కంపెనీ iQOO Z9 5G మోడల్‌ను మంగళవారం భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన పెద్ద AMOLED డిస్ప్లేతో విడుదలైంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌తో పాటు ఐక్యూ అధికారిక వెబ్‌సైట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేస్తే భారీగా తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 
అమెజాన్‌లో ఎర్లీ యాక్సెస్ సేల్‌లో భాగంగా మార్చి 14 నుంచి iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే దీనిని భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్న కస్టమర్లకు ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.19,999తో లభిస్తోంది.  ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ కలిగిన మొబైల్‌ ధర రూ.21,999తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. 

ఈ మొబైల్‌పై అమెజాన్‌ అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,500 నుంచి రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఇది కేవలం రూ.17,999కే పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్‌ దీనిపై త్వరలోనే ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ టాప్ ఫీచర్స్‌:
✾ శక్తివంతమైన ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో అత్యుత్తమ పనితీరుతో లభించనుంది.
✾ అద్భుతమైన డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
✾ మెరుగైన కెమెరా: 64MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది.
✾ వేగవంతమైన ఛార్జింగ్: 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
✾ ఆకర్షణీయ డిజైన్: గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌తో స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది.
✾ ర్యామ్‌, స్టోరేజ్: 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.
✾ స్టీరియో స్పీకర్లు: డోల్బీ Atmos సపోర్ట్‌తో మెరుగైన ఆడియో అనుభవాన్ని కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
✾ ఆండ్రాయిడ్ 12: తాజా ఆండ్రాయిడ్ OS వెర్షన్‌తో ముందుగానే లోడ్ చేసుకుని రాబోతోంది.
✾ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్: వేగవంతమైన, సురక్షితమైన అన్‌లాక్ సిస్టమ్‌.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News