Motorola G85 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.16 వేలకే 128 GB స్టోరేజ్‌ Motorola G85 5G మొబైల్‌.. ఇదే మంచి ఛాన్స్‌!

Motorola G85 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలకే లభించబోతోంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 27, 2024, 11:53 AM IST
Motorola G85 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.16 వేలకే 128 GB స్టోరేజ్‌ Motorola G85 5G మొబైల్‌.. ఇదే మంచి ఛాన్స్‌!

 

Motorola G85 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని స్మార్టఫోన్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ నడుస్తున్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభించడమే కాకుండా అనదంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటోకి సంబంధించిన మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి బంఫర్‌ తగ్గింపు లభిస్తోంది. అయితే ఏ మోటో మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తుందో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లో త్వరలోనే Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ 5000 mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఇది మూడు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.20,999 నుంచి ప్రారంభమైంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 14 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి పేమెంట్ చేసేవారికి ఎంతో తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ వినియోగించుకోవాలనుకునేవారు దీనిని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌ పోనుఏ రూ.16,999కే కొత్త ఫోన్‌ పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Snapdragon 7050 5G ప్రాసెసర్‌
6-ఇంచ్ FHD+ LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేటు
50MP ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రావైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
5000mAh బ్యాటరీ
డోల్బీ ఆడియో ఆప్టిమైజ్డ్ స్పీకర్లు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
128GB ఇంటర్నల్ స్టోరేజ్
20W టర్బో ఛార్జింగ్
5G కనెక్టివిటీ

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News