Oneplus Pad 2 Price: 9510mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్‌తో కొత్త ట్యాబ్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!

Oneplus Pad 2 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి వన్‌ప్లస్‌ కొత్త ట్యాబ్‌ రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 6, 2024, 11:48 AM IST
Oneplus Pad 2 Price: 9510mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్‌తో కొత్త ట్యాబ్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!

Oneplus Pad 2 Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇప్పటికే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌,స్పెషిఫికేషన్స్‌ను వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ అధికారికంగా వెల్లడించారు. దీనిని కంపెనీ OnePlus Pad 2 పేరుతో తీసుకు రానుంది. ఈ ట్యాబ్‌ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 ట్యాబ్‌ నాలుగు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌, 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌తో పాటు 16GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో రాబోతోంది. దీంతో పాటు రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో రానుంది. ఇది ఏప్రిల్‌ నెలలో విడుదల కావాల్సి ఉంటుంది. ఈ ప్యాడ్‌ అన్ని ట్యాబ్‌ల కంటే ఎక్కువగా బరువును కలిగి ఉంటుంది. అలాగే ఈ ట్యాబ్‌ పవర్‌ ఫుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 

Snapdragon 8 Gen 3 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌:
ఈ OnePlus Pad 2 స్మార్ట్‌ట్యాబ్‌ గీక్‌బెంచ్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఇది OP2404 మోడల్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ట్యాబ్‌ Snapdragon 8 Gen 3 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. దీని పనితీరు విషయానికొన్తే, గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ చేసేవారికి ఈ ట్యాబ్‌ చాలా బాగుంటుంది. ఇది కార్టెక్స్-X4 కోర్, ఐదు కార్టెక్స్ A720 కోర్లతో అందుబాటులోకి రానుంది. ఇది మల్టీ-కోర్ పరీక్షలలో 2000 నుంచి 7000 కంటే ఎక్కువ స్కోర్‌లను సాధించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

లీక్‌ అయిన ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
12.1 అంగుళాల 3K LCD డిస్‌ప్లే
3000x2120 పిక్సెల్‌లు
900 nits బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ 
67W ఛార్జింగ్ సపోర్ట్‌
9510mAh బ్యాటరీ
4nm ప్రాసెస్‌
Dolby Atmos సపోర్ట్‌
డబుల్‌ కెమెరా సపోర్ట్‌
13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
USB టైప్-C 3.2 Gen 1 పోర్ట్‌
USB టైప్-సి 2.0 పోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News