Samsung Galaxy M14 5G: మార్కెట్‌లో ప్రతి నెల కొత్త కొత్త ఫోన్లు విడుదలవుతూనే ఉంటాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో 5జీ ఫోన్లు ఆఫర్ల పేరిట తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ఇటీవలే ఇతర దేశాల్లోని మార్కెట్‌లో లాంచ్ అయిన బడ్జెట్ ఫోన్‌లలో శాంసంగ్ గెలాక్సీ M14 ఒకటి. ఇది 5G టెక్నాలజీతో మార్కెట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు ఇష్టమైన చాలా రకాల ఫీచర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఇది అతి తొందరలోనే భారతీయులకు అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, చిప్‌సెట్ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఫోన్‌కు BIS ఆమోదం:
శాంసంగ్ గెలాక్సీ M14 BIS ఆమోదం ఇచ్చింది. అంతేకాకుండా SM-M146B/DS నంబర్‌తో గుర్తించింది. ఇదే నంబర్‌తో ప్రస్తుతం గెలాక్సీ F14 5G అని అధికారి వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. అయితే ఇందులో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయని.. ఈ ఫోన్‌నుకు సంబంధించి ఇతర వివరాల అందుబాటు రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా తొందరిలోనే బడ్జెట్‌లో ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ కొనుగోలు చేయోచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M14 5Gలో ఫీచర్లన్ని అదుర్స్:
శామ్సంగ్ గెలాక్సీ M14 5G Exynos 1330 చిప్‌సెట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇది ముందుగా రెండు వెరియంట్స్‌లో లాంచ్ చేస్తారని సమాచారం. ముందుగా భారత మార్కెట్‌లో 4GB ర్యామ్‌తో కూడిన ఫోన్‌ని విడుదల చేసి తర్వాత 8GB ర్యామ్ మొబైల్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అంతేకాకుండా One UI 5.0కి సపోర్ట్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 2.4GHz క్లాక్ చేయబడిన రెండు కోర్లు రన్ అవుతాయి.
శామ్సంగ్ గెలాక్సీ M14 5G బ్యాటరీ:
శామ్సంగ్ గెలాక్సీ 14 5G Galaxy F13 కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌లతో మార్కెట్‌లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ క్రీన్ అన్ని మొబైల్స్‌లా కాకుండా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 6000mAh బలమైన బ్యాటరీ ఉండబోతోందని సమాచారం. అంతేకాకుండా బ్యాక్ సెటప్‌లో 50MP కెమెరా కలిగి ఉంటుంది. గెలాక్సీ F14 5Gలో కంపెనీ కొన్ని మెరుగుదలలు చేసి కొత్త అప్‌డేట్‌లతో ఫోన్‌ను లాంచ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురికి గాయాలు
ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook