Bala krishna: అభిమాని కోరిక తీర్చిన బాలకృష్ణ.. గృహప్రవేశానికి వెళ్లి మూడు గంటల పాటు హల్ చల్.. వీడియో వైరల్..

Nandamuri bala krishna: నందమూరీ బాలయ్య బాబు ఇటీవల ఒక అభిమాని ఆహ్వానిస్తే..  గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ మూడు గంటల పాటు హల్ చల్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 23, 2024, 01:05 PM IST
  • ఫ్యాన్ ను ఫుల్ ఖుషీ చేసిన బాలయ్య...
  • గృహప్రవేశంలో ఊహించని అతిథి..
Bala krishna: అభిమాని కోరిక తీర్చిన బాలకృష్ణ.. గృహప్రవేశానికి వెళ్లి మూడు గంటల పాటు  హల్ చల్.. వీడియో వైరల్..

Balakrishna attended fan house warming function video goes viral: నందమూరీ నట సింహాం బాలయ్యకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన  ఎక్కడైన ప్రొగ్రామ్ లకు అటెండ్ అయితే ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అంతేకాకుండా.. ఆయనతో ఒక్కసారైన మాట్లాడేందుకు తెగ ఆసక్తి చూపిస్తారు. మూవీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగిన  కూడా.. ఆయన తనకంటూ అభిమానుల పట్ల ప్రేమతో ఉంటారు.

 

ఒక వైపు సినిమా రంగంలో ఉన్న కూడా.. రాజకీయాల్లో కూడా తనదైన మార్కుచూపిస్తున్నారు. ఇటీవల వరదల వల్ల నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతుగా ఆపన్న హాస్తం కూడా అందించారు. ఈ  క్రమంలో బాలయ్య బాబుకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

పూర్తి వివరాలు..

నందమూరీ  బాలకృష్ణ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన తన అభిమాని.. గృహప్రవేశ వేడుకకు హజరయ్యారు. మొదట అంతటి గొప్ప నటుడు, హిందుపురం ఎమ్మెల్యే తమ ఇంటికి ఆహ్వానిస్తే వస్తారో.. రారో అనిభావించారంట. కానీ బాలయ్య బాబు మాత్రం.. సమయం తీసుకుని మరీ అభిమాని ఇంటికి వెళ్లారు. అంతేకాకుండా... దాదాపు 3 గంటలపాటు గృహప్రవేశంలో అక్కడే ఉన్నారు.

అభిమాని కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. బాలయ్య తమ ఇంటికి రావడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సదర ఇంటి యజమాని మాత్రం ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఇంతటి గొప్ప నటుడు.. తమ ఇంటికి రావడం నమ్మలేకుండా ఉన్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా.. ఇంతటి మంచి మనిషిని తమ జీవితంలో చూడలేదని..  బాలయ్య డౌన్ టూ ఎర్త్ అంటూ కూడా ప్రశంసలతో ముంచెత్తారు.

Read more: Viral video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..

బాలయ్య బాబు.. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని... దంపతులను ఆశీర్వదించారు. అక్కడే భోజనాలు కూడా చేశారు. దాదాపు మూడు గంటల సేపు బాలయ్య అక్కడ ఉన్నారు. అక్కడున్న అందరితో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News