Bathukamma Sarees: శుక్రవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభం

బతుకమ్మ చీరల పంపిణిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana ) శుక్రవారం ప్రారంభించనుంది.

Last Updated : Oct 8, 2020, 05:36 PM IST
    • బతుకమ్మ చీరల పంపిణిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది.
    • రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు కానుకగా ఇవ్వనుంది ప్రభుత్వం.
    • అక్టోబర్ 9వ తేదీ నుంచి పంపిణీ మొదలై అక్టోబర్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది.
Bathukamma Sarees: శుక్రవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభం

బతుకమ్మ చీరల పంపిణిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana ) త్వరలో ప్రారంభించనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు కానుకగా ఇవ్వనుంది ప్రభుత్వం.  అక్టోబర్ 9వ తేదీ నుంచి పంపిణీ మొదలై అక్టోబర్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం 287 డిజైన్లలో అల్లిన ఈ చీరలను 33 జిల్లాలకు తరలించనున్నారు. అక్కడ రేషన్ షాపుల్లో వాటిని అందించనున్నారు. బతుకమ్మ చీరల ( Bathukamma Sarees ) కోసం ఈ  ఏడాది తెలంగాణ ప్రభుత్వం మొత్తం 371.81 కోట్లు ఖర్చు చేసి 98.50 లక్షల చీరలను సిద్ధం చేయించింది. 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) శుక్రవారం రోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే పంపిణి కార్యక్రమంలో ఎవరికైనా చీరలు అందకపోతే వారు అక్టోబర్ 12  నుంచి 15 మధ్యలో కూడా తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం అని అధికారులకు తెలిపారు. మరోవైపు యాదాద్రిలో ( Yadadri ) బతుకమ్మ చీరలను ఇంటింటికి పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సుమారు 2,59, 800 చీరలు జిల్లాకు చేరుకున్నాయి. 

సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో తయారీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణి చేనేత కళకారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ జిల్లాల్లో బతుకుమ్మ చీరలు తయారీ జరుగుతుంది. దీంతో కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా సాధికారత సాధిస్తున్నాయి.

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News