SriRama Navimi: రెండు సంవత్సరాల తరువాత కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. సిద్ధం అవుతున్న భద్రాచలం

గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా భద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సారి భారీ ఎత్తున శ్రీరామనవమి పండుగ సన్నాహాలు చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 12:01 PM IST
  • శ్రీరామనవిమి ముస్తాబవుతున్న భద్రాచలం ఆలయం
  • ఈ నెల 10న కల్యాణం, 11న పట్టాభిషేకం
  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌
SriRama Navimi: రెండు సంవత్సరాల తరువాత కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. సిద్ధం అవుతున్న భద్రాచలం

SriRama Navimi: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.  శ్రీరామనవమి రోజున ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం శ్రీసీతారాముల ఉత్సవ మూర్తులను కల్యాణ మండపం‌ నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు.

ఈ సందర్భంగా భక్తులకు సీతారామచంద్రస్వామిలను దర్శించుకొనే భాగ్యం కల్పిస్తారు. సాయంత్రం కల్యాణ వేడుక అంగరంగవైభవంగా జరగనుంది. కల్యాణ వేడుక ముగిశాక 11వ తేదీ సోమవారం ఉత్సవ మూర్తులను ఆలయం‌ నుండి కల్యాణ మండలానికి మళ్లీ ఊరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం 10:30 గంటల నుండి  మధ్యాహ్నం12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం కీలక ఘట్టం జరుగుతుంది. అనంతరం ఉత్సవమూర్తులను కల్యాణ మండలం నుండి ఊరేగింపుగా ఆలయానికి  తీసుకొస్తారు. 

శ్రీరామ నవమి సందర్భంగా స్వామికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కల్యాణ వేడుకలను భక్తులు కనులారా తిలకించే అవకాశం కలిగింది. దీంతో తెలంగాణ నుండే కాకుండా ఏపీ సరిహద్దు ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ‌

ఈసందర్బంగా‌ తెలంగాణ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుండి భద్రాచలంకు ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేసింది. భద్రాచలం‌కు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆయా శాఖల అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు,కలెక్టర్ అనుదీప్, పలువురు అధికారులతో కలిసి మంత్రి అజయ్ ఆలయాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Also Read: Pawan Kalyan Shooting: ఆ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు!

Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News