Ys Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు రిలీఫ్, పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

Ys Sharmila Padayatra: వైఎస్సార్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆమె తలపెట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2022, 03:51 PM IST
Ys Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు రిలీఫ్, పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

వైఎస్సార్ టీపీ నేత వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ పోలీసులు బ్రేక్ చేయడంతో కొద్దిరోజులు ఆగిపోయింది. ఇప్పుడు హైకోర్టు అనుమతితో మళ్లీ ప్రారంభం కానుంది.

తెలంగాణ హైకోర్టు నుంచి వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిలకు రిలీఫ్ లభించింది. ఆమె తలపెట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతించడం లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించిన వైఎస్ షర్మిలకు కోర్టు సానుకూలంగా స్పందించింది. పాదయాత్రతో పాటు వరంగల్ బహిరంగ సభకు అనుమతి కోరుతూ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై హైకోర్టు విచారించింది. 

హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత  పోలీసులు ఎలా నిరాకరిస్తారని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకులు అందరూ పాదయాత్ర కోసం  కోర్టుల చుట్టూ  తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తెలంగాణను తాలిబాన్‌ల రాష్ట్రంగా మారుస్తున్నారని షర్మిల చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కోర్టు ఆదేశాలిచ్చినా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. 

రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తరువాత వ్యాఖ్యలు చేస్తే..పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని కోర్టు ప్రశ్నించింది. వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్పడంతో..హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై ఇలా వ్యాఖ్యానించడం సరికాదని కోర్టు షర్మిలకు సూచించింది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణమని హైకోర్టు అభిప్రాయపడింది. 

చివరిగా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన షరతుల్ని గుర్తుంచుకోవాలని వైఎస్ షర్మిలకు సూచించింది.

Also read: MLC Kavitha: ఆ మాటలు నన్ను బాధించాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News