అక్బరుద్దీన్ కు రాజాసింగ్ సరికొత్త సవాల్: 15 నిమిషాలు కాదు.. ఐదు నిమిషాలు చాలు

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఎంఎంఐ నేతలను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Last Updated : Dec 4, 2018, 10:31 AM IST
అక్బరుద్దీన్ కు రాజాసింగ్ సరికొత్త సవాల్: 15 నిమిషాలు కాదు.. ఐదు నిమిషాలు చాలు

హైదరాబాద్: రాజాసింగ్ మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశారు.  ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ 15 నిమిషాలు కాదు.. నాకు ఐదు నిమిషాలు చాలు... నీ సెక్యూరిటీని వదిలి ఎల్బీ స్టేడియానికిరా...నాతో కబడ్డి ఆడు ఎవరు మగాడో తేలిపోతుందని రాజాసింగ్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటే వందేమాతరం పాడాలి.. భారత్ మాతాకి జై. చెప్పాల్సిందేనంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

నిజాం పేర్లు మార్చేస్తాం...
ఎంఐఎం ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని రాజాసింగ్ ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు కేసీఆర్ కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఎలాగైతే ఒక్కసారి అధికార పగ్గాలు అప్పగించారో.. తమకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృద్ధి ఏంటో చూపిస్తామని ప్రజలను రాజాసింగ్ కోరారు. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో మోడీ ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.. బీజేపీ మందు రెండే రెండు లక్ష్యాలు.. మొదటిది అభివృద్ధి... రెండోవది హైదరాబాద్ పేరు భాగనగరంగా మార్పు. దీంతో పాటు తెలంగాణలో ఉన్న నిజాం పేర్లు మార్చి తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన వోళ్ల పేర్లు పెడతామని ఈ సందర్భంగా రాజాసింగ్ పేర్కొన్నారు

ఓవైసీ బ్రదర్స్ పై ఘాటు వ్యాఖ్యలు

 ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చి చూడాలని ఓ కుక్క సవాల్ చేసిందని.. తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైనా తమ కాళ్ల వద్దకే రావాల్సి ఉంటుందని మరో కుక్క మొరుగుతోందని ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్, అక్బరుద్దీన్ లను ఉద్దేశించిన రాజాసింగ్ వ్యాఖ్యానించారు..ప్రధాని మోదీ ఒకటి రెండు సార్లు కాదని...ఎన్నిసార్లు అయినా హైదరాబాద్ లో అడుగుపెడతారని రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్ ఎంఐఎం జాగీరు కాదని ఈ సందర్భంగా రాజాసింగ్ పేర్కొన్నారు. ఓవైసీ బ్రదర్స్ ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ను చెప్పుచేతల్లో పెట్టుకున్నావ్ సరే.. ఒక రోజు వస్తుంది మీరు మా కాళ్ల దగ్గర పడి ఉండాల్సి వస్తుంది. యువకులు నీ ఇంట్లోకి వచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రాజాసింగ్ ఓవైసీ బ్రదర్స్ కు వార్నింగ్ ఇచ్చారు.

 

Trending News