Telangana BJP: చక్రం తిప్పిన సీనియర్లు.. టీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆయనే!

తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్‌ పదవిపై కొద్దిరోజులుగా సస్పెన్స్‌ నడుస్తోంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ హైకమాండ్‌ స్టేట్‌చీఫ్‌ పదవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కొలిక్కి రావడంతో సంస్థగత ఎన్నికలపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సంస్థగత ఎన్నికల కసరత్తు డిసెంబర్‌ నెలఖరు వరకు జరిగే చాన్స్‌ ఉంది. ఆ వెంటనే కొత్త ఏడాదిలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈసారి రేసులో నలుగురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Last Updated : Nov 16, 2024, 07:55 PM IST
 Telangana BJP: చక్రం తిప్పిన సీనియర్లు.. టీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆయనే!

Baratiya Janata party: తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్‌ పదవిపై కొద్దిరోజులుగా సస్పెన్స్‌ నడుస్తోంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ హైకమాండ్‌ స్టేట్‌చీఫ్‌ పదవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కొలిక్కి రావడంతో సంస్థగత ఎన్నికలపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సంస్థగత ఎన్నికల కసరత్తు డిసెంబర్‌ నెలఖరు వరకు జరిగే చాన్స్‌ ఉంది. ఆ వెంటనే కొత్త ఏడాదిలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈసారి రేసులో నలుగురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బీజేపీ రాష్ట్రచీఫ్‌గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కడంతో.. ఢిల్లీకే పరిమితం అయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పార్టీ నేతలకు ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నారు. అందువలన పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ పెద్దలు డిసైడ్‌ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీకి కొత్త చీఫ్‌ వస్తారని పార్టీ నేతలు చెప్పారు. కానీ అప్పటినుంచి కొత్త ప్రెసిడెంట్‌ పోస్టుపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోలేదు. అయితే కిషన్ రెడ్డి పార్టీ చీఫ్‌ పదవి తీసుకున్నాక.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ 8 మంది ఎంపీలు గెలిచారు. పార్టీకి 35 ఓటింగ్‌ శాతం మేర ఓట్లు పెరిగాయి. ఇలా ఒక్కసారిగా కమలం పార్టీ పుంజుకోవడం వెనుక బండి సంజయ్‌ కూడా ఓ కారణమని పార్టీ పెద్దలు గుర్తించారట.. బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి ఓ ఊపు వచ్చిందని పార్టీ నేతలే అంగీకరించారు. అయితే ఎన్నికల తర్వాత ఇంతా జరిగినా పార్టీలో చేరికలు మాత్రం జరగపోవడం నేతలను ఆశ్చర్యానికి గురిచేసందని చెబుతున్నారు..

ఇక తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా బీసీ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ను నియమించింది. అటు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీ నేతను నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ కూడా బీసీ నేతకే రాష్ట్ర చీఫ్‌ పదవి ఇస్తే పార్టీకి మరింత మైలెజ్‌ వస్తుందని పార్టీ నేతల భావనగా ఉందట. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా బీసీ నేతకే స్టేట్‌ చీఫ్ పదవి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే బీసీ నేత ఈటెల రాజేందర్‌కు బీజేపీ చీఫ్ పదవి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈటెలకు ఆ పదవి దక్కలేదు. ప్రస్తుతం పార్టీ మెంబర్‌ డ్రైవ్‌ దేశవ్యాప్తంగా జరుగుతోంది. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియామిస్తారు. ఆ తర్వాత కొత్త ఏడాది నూతన ప్రెసిడెంట్‌ నియామకం ఉంటుందని పార్టీ హైకమాండ్‌ నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ స్టేట్‌ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు నలుగురు లీడర్ల మధ్య పోటీ తీవ్రంగా జరుగుతోందట. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను మరోసారి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌కు నాయకత్వ బాధ్యతలు ఇస్తే పార్టీకి మరింత జోష్ వస్తుందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. గతంలో బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయాన్ని పార్టీ పెద్దలకు గుర్తు చేస్తున్నారట. మరోవైపు బీసీ సామాజికవర్గం నుంచి ఈటెల రాజేందర్‌కు పార్టీ చీఫ్‌ పదవి దక్కే చాన్స్‌ ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈటెల రాజేందర్‌కు ప్రెసిడెంట్‌ పదవిని ఇస్తే.. బీసీ ఓటర్లను మరింత ఆకర్షించవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు కూడా పార్టీ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. రఘునందన్‌ రావు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రఘనందన్‌ రావుకు అడ్వాంటేజ్‌గా మారిందని చెబుతున్నారు.

Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

మరోవైపు పార్టీ స్టేట్‌ చీఫ్‌ పదవిలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ సైతం ముందున్నారని తెలుస్తోంది. నిజామాబాద్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన అరవింద్‌కు పార్టీ పెద్దల ఆశీర్వాదం మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు విషయంలో అరవింద్‌ కృషిని పార్టీ పెద్దలు మెచ్చుకున్నారట.. నిజామాబాద్‌కు ఎలాగైనా సరే పసుపుబోర్డు తీసుకురావాలనే లక్ష్యంతో అరవింద్‌ ప్రధాని మోడీని సైతం అనేక మార్లు కలిసి విజ్ఞాప్తి చేశారట.. అయితే అరవింద్‌ కష్టపడే తత్వం చూసిన పార్టీ పెద్దలు.. అరవింద్‌కు ఓ అవకాశం ఇవ్వాలనే ఆలోచన సైతం చేస్తున్నారని తెలిసింది. ఇక మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కూడా తనకు ఓ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది. అయితే డీకే ఆరుణ పార్టీలోకి కొత్తగా చేరారని రాష్ట్ర నేతలు అభ్యంతరాలు చెబుతున్నట్టు తెలిసింది.

అటు కాషాయ పార్టీలో నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు తెలుస్తోంది. ఓ వైపు కొత్త నేతలకు అవకాశం ఇవ్వొద్దని సీనియర్లు అడ్డుపడుతున్నట్టు సమాచారం. ఇస్తేగిస్తే తమకే కొత్త ప్రెసిడెంట్‌ పోస్టును ఇవ్వాలని సీనియర్ల డిమాండ్‌ ఉందట.. ఇక సీనియర్ జాబితాలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీని తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మద్దతుతో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన ఉన్నారట.. మరికొందరు లీడర్లు కూడా స్టేట్‌ చీఫ్‌ పదవి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర చీఫ్‌ పదవిలో రేసులో చాలామంది లీడర్లు ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం ఆచీతూచీ అడుగులు వేసే దోరణిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News