BJP Satya Kumar Sensational Allegations on BRS: బిజెపి జాతీయ నేత సత్య కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీ, అండమాన్ నికోబార్ ఇంచార్జ్ ఉత్తర ప్రదేశ్ కో ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న సత్య కుమార్ యాదవ్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యలో ఆయన మీద అమరావతిలో దాడి కూడా చేసే ప్రయత్నం జరిగింది. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని టార్గెట్ చేశారు. ‘’దోచుకోవడమే డిఎన్ఏ గా మార్చుకున్న బీఆర్ఎస్ దొంగలు తెలుగు తల్లి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను కూడా చోరీ చేశారని ఆయన ఆరోపించారు’’.
Also Read: Samantha vs Lawrence: డిజాస్టర్ దిశగా 'శాకుంతలం'.. షాకిస్తూ దూసుకుపోతున్న రుద్రుడు!
నూతన సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న విగ్రహాలు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కాబడ్డాయని ప్రస్తుతానికి ఎక్కడున్నాయో తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఆంధ్ర నాయకులను చిహ్నాలను అవమానించడమే అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ గారు కేటీఆర్ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఆ రెండు విగ్రహాలు పున ప్రతిష్టింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఆయన షేర్ చేశారు. అంతేకాక వైఎస్ జగన్ ని కూడా ఆయన టార్గెట్ చేశారు. జగన్ లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పథకానికి లేదా ప్రతి మూల ఉన్న ప్రతి బిల్డింగ్ కి తన పేరు లేదా తన తండ్రి వైఎస్ పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
జాతీయ నేతలను సైతం పట్టించుకోకుండా వారి పేర్లను సైతం తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చారని ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ వైయస్సార్ వ్యూ పాయింట్ గా మార్చారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read: New MMTS Services: జంటనగర వాసులకు గుడ్‌న్యూస్..కొత్తగా 20 ఎంఎంటీఎస్ రైళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook