Bomb Threat to Schools in Bengaluru: బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 7 స్కూళ్లలో బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఆ స్కూళ్లకు చేరుకుని బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు వట్టిదేనని తేల్చారు.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 'మీ స్కూల్లో శక్తివంతమైన బాంబు అమర్చబడింది. ఇదేమీ జోక్ కాదు. వెంటనే పోలీసులకు చెప్పండి. వందలాది మంది ప్రాణాలు బలి కావొచ్చు. ఆలస్యం చేయకండి. ఇప్పుడిక అంతా మీ చేతుల్లోనే ఉంది.' అని మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. బాంబు బెదిరింపు మెయిల్ గురించి తెలిసిన వెంటనే స్కూళ్ల వద్దకు చేరుకుని విద్యార్థులను బయటకు పంపించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదన్నారు.
బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన స్కూళ్లలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (వార్తూర్), గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ (గోవిందపురా), ఎబినేజర్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎలక్ట్రానిక్ సిటీ) ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు బెదిరింపు మెయిల్ ఎవరు పంపారనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: IPL 2022 DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానా!
Also Read: Delhi Capitals: డిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త, అందుబాటులో వచ్చిన వార్నర్, అన్రిచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook