BRS Party Meet: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ శాసనసభా పక్షనేతను ఇవాళ ఎన్నుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాసనసభా పక్షనేతగా ఎన్నుకునేందుకు రంగం సిద్దమైంది. కేసీఆర్ తుంటి చికిత్స కారణంగా ఆసుపత్రిలో ఉండటంతో ఆయన తప్ప మిగిలిన 38 ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే ఎమ్మెల్యేల భేటీకు కేటీఆర్ అధ్యక్షత వహించనున్నారు. కేసీఆర్ ను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఆ తరువాత అల్పాహార కార్యక్రమం ఉంటుంది. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఎంపిక అనంతరం ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. 119 సభ్యుల తెలంగాణ అసెంబ్లీలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెల్చుకోగా మిత్రపక్షం సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇక బీజేపీ 8 స్థానాలు, మజ్లిస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించాయి.
బలమైన ప్రతిపక్షం హోదా దక్కడంతో శాసనసభాపక్షనేతకు కేబినెట్ హోదా ఉంటుంది. వాస్తవానికి శాసనసభా పక్షనేతగా కేటీఆర్ లేదా హరీష్ రావు పేర్లు విన్పించాయి. కానీ కేసీఆర్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తే పార్టీకు, ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైంది.
ఇంట్లో బాత్రూంలో కాలు జారిపడటంతో కేసీఆర్ ఎడమకాలి తుంటికి తీవ్రగాయమైంది. ప్రస్తుతం ఆయనకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం తుటి మార్పిడి శస్త్ర చికిత్స పూర్తయింది. పూర్తిగా కోలుకునేందుకు మరో 6-8 వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటి వరకూ పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
Also read: Mahalakshmi Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పధకం ఇవాళ ప్రారంభం, ఆర్టీసీపై పడే భారమెంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook