CM KCR Elections Campaign Schedule: తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ ఖారవ్వగానే తెలంగాణలో రాజాకీయ పార్టీలు ఎన్నికల సమరానికి తగు విధంగా ప్రణాలికలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి కారు జోరును మరింత పెంచుతామని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేయగా.. ప్రజల్లో కాంగ్రెస్ కు మద్దతు పెరిగింది.. ఎలా అయినా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి తామే పాలన చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. వీరితో పాటుగా బీజీపీ కూడా ఎన్నికల పోరులో తగిన ఎత్తుగడలు వేస్తున్నాయి.
బీఆర్ఎస్ తమ పార్టీ నుండి ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయగానే కొంత ,మంది అసమ్మట్టి నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి గులాభీ బాస్ మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకనే తన్న 16 రోజుల షెడ్యూల్ విడుదల చేసారు.
ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ తో మొదలయ్యే తొలిదశ ఎన్నికల ప్రచార పర్వం నవంబర్ 8 వ తేదీన బెల్లంపల్లిలో ముగియనుంది. ప్రతిచోటా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటనతో పాటు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మొదటగా 40 నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత, ఎమ్మెల్యేల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే! అటు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సైతం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగి ప్రచార పర్వం మొదలు పెడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది.
Also Read: IND Vs AFG World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌దే బ్యాటింగ్.. టీమిండియాలో అనూహ్య మార్పు.. ఆ బౌలర్ ఔట్
ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే.. ముఖ్యంగా కాంగ్రెస్ మరియు బీజీపీ రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అభ్యర్థుల ప్రకటన.. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. మిగతా రాజకీయ పార్టీలు కార్యాచరణ రూపొందించటంలో మరియు వాటిని అనుసరించటంలోనూ విఫలం అయ్యాయి.
కాంగ్రెస్ మరియు బీజీపీ పార్టీలు ఒకడుగు వేసేలోపే బీఆర్ఎస్ వంద అడుగులు వేసే పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కనుంది. ఇక ఈ సారి బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నవంబర్ 9 తేదీ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య గజ్వేల్ లో నామినేషన్ వేయనున్నారు. తరువాత అటు నుండి నేరుగా కామారెడ్డిలో చేరుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో తన రెండో నామినేషన్ వేయనున్నారు. ఆ తరవాత సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
Also Read: Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023, ఆసియా కుబేరుడు అంబానీనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి