lady Aghori halchal videos: లేడీ అఘోరీ ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం తర్వాత అక్కడికి చేరుకుని హల్ చల్ చేసింది . ఆ తర్వాత తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను దర్శనం చేసుకుంది. మరొవైపు.. తెలంగాణలో దీపావళిరోజు ఆత్మర్పణం చేసుకుంటానని కాంట్రవర్సీకి వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అఘోరీనీ కొన్ని రోజుల పాటు ఆమె ఇంటిలో నిర్భందిచారు. ఆ తర్వాత మళ్లీ కార్తీక మాసం అని.. పూజలు చేసుకొవాలని చెప్తే.. వేరే రాష్ట్రం బార్డర్ వరకు తీసుకెళ్లి ఆమెను పోలీసులు వదిలేశారు.
Mamnoor Police have booked #Aghori Naga Sadhu, frequently interviewed in regional media nowadays for allegedly sacrificing a hen at a graveyard. LLB student students explain the case which is registered under Sec325 BNS & 11(1)(A) of the Prevention of Cruelty to Animals Act pic.twitter.com/aSNcD91uie
— Deepika Pasham (@pasham_deepika) November 24, 2024
ఈ క్రమంలో తెలంగాణలో శంషాబాద్ మరికొన్ని చోట్ల విగ్రహాల ధ్వంసం తర్వాత అఘోరీ మళ్లీ తాండవం చేసింది. సీఎం రేవంత్ ను సీఎం సీటు నుంచి దిగిపోవాలని హెచ్చరించింది. ఆతర్వాత ఏపీలో కూడా రచ్చ రచ్చ చేసింది. శ్రీకాళ హస్తిశ్వర ఆలయం దగ్గర పెట్రోల్ పోసుకుని అక్కడి వారికి చుక్కలు చూపించింది.
అంతే కాకుండా..విజయవాడకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుంది. ఆతర్వాత ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను కలుస్తానని వివాదాస్పదంగా ప్రవర్తించింది. పోలీసులపైనే దాడికి తెగపడింది. ఈ క్రమంలో గతంలో లేడీ అఘోరీ వరంగల్ లోన ముమ్మనూరులో చేసి పని ఆమె మెడకు చుట్టుకుందని చెప్పుకొవచ్చు.
లేడీఅఘోరీ తెలంగాణలోని వరంగల్ లోని మాముననూరుకు వెళ్లింది. అక్కడ స్మశానంలో భయంకరమైన పూజలు చేసింది. ఒక నిప్పుల గుండం ఏర్పాటు చేసుకుని.. దాని ముందు ఒక కోడిని పెట్టుకుంది. ఏవేవో మంత్రాలు పఠిస్తు.. ఆ కోడిని అగ్నికి బలిచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన కొంత మంది యువత లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.
Read more: Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?
ముఖ్యంగా ఆమె కోడిని బలివ్వడం, రక్త తర్పణం చేయడం నేరమని తెలుస్తొంది. ఎనిమల్ యాక్ట్ ప్రకారం.. జంతుబలి అనేది నేరం. అందుకే.. యువకులు.. పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో .. 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.. ఈ ఘటన నవంబర్ 19వ తేదీన అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో జరిగినట్లు తెలుస్తొంది. అఘోరీ పై చర్యలు తీసుకొవాలని సదరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.