తెలంగాణ మహిళా ఉద్యోగుల సెలవుల్లో మార్పు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగం చేసే మహిళా ఉద్యోగులపై సర్కారు వరాల జల్లు కురిపించింది. 

Last Updated : Sep 1, 2018, 10:02 PM IST
తెలంగాణ మహిళా ఉద్యోగుల సెలవుల్లో మార్పు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగం చేసే మహిళా ఉద్యోగులపై సర్కారు వరాల జల్లు కురిపించింది. మహిళా ఉద్యోగులకు ప్రస్తుత సెలవులకు అదనంగా.. మరో ఐదు రోజులు సాధారణ సెలవులు ప్రకటిస్తున్నామని తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సాధారణ, ఐచ్చిక సెలవులకు అదనంగా ఈ సెలవులను మంజూరు చేస్తున్నట్లు సర్కారు తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతిని మంజూరు చేయగానే ఈ సెలవులకు సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

కాగా తాజా నిబంధనల ప్రకారం సర్కారు గతంలో చెప్పినట్లు ఎవరైనా ఉద్యోగిని గర్భిణిగా ఉంటే 8వ నెల నుంచి వరుసగా 180 రోజులు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అయితే.. తొలి కాన్పుతోపాటు రెండోసారి అయ్యే కాన్పుకు మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు. పర్మినెంటు ఉద్యోగినులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు అవుతాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి 8వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి.. ఆ రోజును కూడా పురస్కరించుకొని సెలవు తీసుకోవచ్చని మహిళా ఉద్యోగినులకు తెలిపింది. 

2018 సంవత్సరంలో తెలంగాణ సర్కారు గవర్నమెంట్ ఉద్యోగులకు 28 సాధారణ సెలవులు, 22  ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. ఈ 28 సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. కొత్త సంవత్సరం (జనవరి 1) రోజును కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. అయితే రెండో శనివారాన్ని పని దినమని పేర్కొంది. అలాగే ఆదివారంతో పాటు, రెండో శనివారాల్లో వచ్చే పండగలు, పర్వదినాలలో భోగి (జనవరి 14), ఉగాది (మార్చి 18) , అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14), రంజాన్  (జూన్ 17) ఉండడం గమనార్హం.

Trending News