Warangal student gets seat in Elon Musk's school: చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటుతున్నాడు వరంగల్‌కి (Warangal) చెందిన ఓ విద్యార్థి. చదివేది ఆరో తరగతే అయినా... కంప్యూటర్ కోడింగ్‌లో ఆరితేరాడు. ఇంత చిన్న వయసులోనే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, పైథాన్ లాంగ్వేజ్ వంటి వాటిపై పట్టు సాధించాడు. ఆ విద్యార్థి ప్రతిభకు అమెరికాలోని (America) కాలిఫోర్నియాలో ఉన్న సింథసిస్ స్కూల్లో (Synthesis school) అడ్మిషన్ లభించింది. ఈ స్కూల్ ఏరోస్పేస్ దిగ్గజం స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్థాపించినది కావడం విశేషం.
వరంగల్‌కి చెందిన ఆ విద్యార్థి పేరు అనిల్ పాల్ (Anil Paul). తల్లిదండ్రులు విజయ్‌పాల్, సృజన. విజయ్‌పాల్ ప్రస్తుతం ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి తెలుసుకున్న విజయ్‌పాల్... తన కుమారుడిని ఎలాగైనా అందులో చేర్పించాలని భావించారు. అందుకు తగిన శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనిల్ పాల్ కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం సాధించాడు.
మూడు రౌండ్‌లలో సాగిన సింథసిస్ స్కూల్ (Elon Musk Synthesis School) ప్రవేశ పరీక్షలో అనిల్ పాల్ సత్తా చాటాడు. మొదటి రౌండ్‌లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌కు సంబంధించి పలు లాజికల్ ప్రశ్నలు ఇచ్చి వాటిని చేధించమన్నారు. అందులో అనిల్ పాల్ ప్రతిభ కనబర్చాడు. రెండో రౌండ్‌లో సింథసిస్ స్కూల్ బోర్డు ఇచ్చిన ఓ ప్రశ్నకు వివరణాత్మక సమాధానంతో కూడిన వీడియోను రూపొందించి పంపించాడు. మూడో రౌండ్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ జరగ్గా... అందులోనూ సత్తా చాటాడు. దీంతో అనిల్ పాల్‌కు సింథిసిస్ స్కూల్లో సీటు ఖరారైంది. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయని... కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాక ఆఫ్‌లైన్ క్లాసులు ఉండొచ్చునని అతని తండ్రి వెల్లడించారు.
సింథసిస్ స్కూల్ ప్రత్యేకతలివే :
ఎలన్ మస్క్ (Elon Musk) జోష్ డాన్‌తో కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను (Synthesis School) స్థాపించారు. ఇప్పుడున్న స్కూళ్లన్నింటి కంటే ఇందులో భిన్నమైన కరిక్యులమ్, యాక్టివిటీస్ ఉంటాయి. క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సంక్లిష్టమైన విషయాలను చేధించడం, కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు అలవరుస్తారు. గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు.
Also Read: అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో అనూహ్య ఘటన.. ఆ వ్యక్తిని కొట్టిన చంపిన భక్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook