వర్సిటీ భూములు ఆక్రమణలపై భట్టీ ఫైర్...

తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Updated: Jun 1, 2020, 10:41 PM IST
వర్సిటీ భూములు ఆక్రమణలపై భట్టీ ఫైర్...

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా (Osmania University) వర్శిటీ భూముల ఆక్రమణలపై పెద్ద ఎత్తున నిరసనలు భగ్గుమన్నాయి. అయితే తెలంగాణ సీఎల్పీ (Congress Party Legislature Party) నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సోమవారం నాడు కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: కీలక నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర కేబినెట్...

 ఇదే అంశంపై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. వర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని, తద్వారా ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని, ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయాలు లేకపోతే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతవిద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..