CM Revanth Reddy: కరెంట్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట టాప్.. రెండో స్థానంలో గజ్వేల్: సీఎం రేవంత్ రెడ్డి

Electricity Dues in Telangana: రాష్ట్రం విద్యుత్ పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీ వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించనివాటితో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 21, 2023, 07:47 PM IST
CM Revanth Reddy: కరెంట్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట టాప్.. రెండో స్థానంలో గజ్వేల్: సీఎం రేవంత్ రెడ్డి

Electricity Dues in Telangana: రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో  సిద్దిపేట మొదటి స్థానంలో ఉందని.. గజ్వేల్, హైదరాబాద్ సౌత్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీ హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. గురువారం ఈ అంశంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి స్థానంలో ఉన్న సిద్దిపేట బకాయిలు 61.37 శాతం ఉన్నాయని చెప్పారు. రెండో స్థానంలో గజ్వేల్ 50.29% బకాయిలు, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయి ఉందని అసెంబ్లీ తెలిపారు.

"సిద్దిపేటలో హరీష్ రావు.. గజ్వేల్‌లో కేసీఆర్.. హైదరాబాద్ సౌత్‌లో అక్బరుద్దీన్.. బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు.. రైతులు రోడ్డెక్కారా..? అని జగదీష్ రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ 1న సబ్ స్టేషన్లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తుచేస్తున్నా.. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆర్ఎస్ పాలనలోనే. కరెంట్ సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారు.." అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 

ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుందని అన్నారు. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదన్నారు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదని హితవు పలికారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసని చెప్పారు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దామనని.. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దామన్నారు.

Also Read: Bhatti Vikramarka: అసెంబ్లీలో కరెంట్‌పై లొల్లి.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. లెక్కలు బయటపెట్టిన భట్టి..!   

Also Read: Free Bus Ticket: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. వాళ్లు టిక్కెట్‌ కొనాల్సిందే.. కొత్త రూల్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News