CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 16, 2024, 05:35 PM IST
  • బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి..
  • గులాబీ బాస్ కు ఊహించని ట్విస్ట్..
CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..

Brs will merge bjp cm revanth reddy comments goes viral: తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తి కరంగా మారాయి. అమెరికా, సౌత్ కొరియాలలో పెట్టుబడులు కోసం సీఎం రేవంత్,  మంత్రులు చేపట్టిన పర్యటన విజయవంతమైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, మంత్రులు మరల హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం రేవంత్ మరోసారి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వర్షాకాలంలో పొలిటికల్  హీట్ ను పెంచేవిగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అతి తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలోకి విలీనం జరుగుతుదంటూ కూడా బాంబు పేల్చారు. అంతే కాకుండా.. బీఆర్ఎస్ ను విలీనం చేస్తే వారికి లభించబోయే పోస్టుల్ని సైతం సీఎం రేవంత్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని, పార్టీ విలీనంతోనే.. లిక్కర్ కేసులో తీహార్ లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందని,  కేసీఆర్ కు గవర్నర్ పదవీ,  కేటీఆర్ కు కేంద్రమంత్రి  పదవి, హారీష్ రావుకు అసెంబ్లీలో అపోసిషన్ నేత పదవీలు ఇస్తారనరి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం  ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పును రాజేశాయి. రుణమాఫీ చెప్పిన సమయానికి చేసేయడం.. రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ కాంగ్రెస్ నేతలు ఏకీపారేస్తున్నారు.

బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో.. స్వయానా.. సీఎం బీఆర్ఎస్ పార్టీవిలీనంపై చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండించారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ , కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. మరోవైపు గత సర్కారు హాయాంలో సాగు నీటి ప్రాజెక్టులలో అనేక అక్రమాలు జరిగాయంటూ కూడా, సీఎం రేవంత్  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు.

Read more: Nandamuri Balakrishna: జిమ్ లో వర్కౌట్స్ చేసిన బాలయ్య.. ఆ విషయంపై సీఎం బావకు స్పెషల్ రిక్వెస్ట్.. అసలు స్టోరీ ఏంటంటే..?

తెలంగాణాలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య నువ్వా.. నేనా.. అన్న విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోవైపు  మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలువివాదాస్పదంగా మారాయి. బస్సుల్లో మహిళలు ఎల్లిపాయలు, కుట్లు అల్లికలు చేసుకుంటూ ప్రయాణిస్తున్నారని కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై దుమారం చెలరేగడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగానే మహిళలకు సారీ చెప్పారు. తన ఉద్దేష్యం మహిళల్ని అగౌరవ పర్చాలని కాదని, బస్సుల సంఖ్యలను పెంచాలని కూడా అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలపై మహిళ కమిషన్ కేటీఆర్ కు నోటీసులు సైతం జారీ చేసింది.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News