తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఇదే

టీ కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో

Last Updated : Sep 6, 2018, 11:03 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఇదే

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేయనుందనే ప్రచారాన్ని బలపరుస్తూ విడుదలైన ఈ మేనిఫెస్టో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

-> ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు
-> స్థిర నివాసం లేని కుటుంబాలకు రూ.5 లక్షలు
-> కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
-> ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
-> అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
-> ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా రూ.2 లక్షలు
-> డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
-> దివ్యాంగులను పెళ్లి చేసుకునే వరుడు/వధువుకి రూ.2లక్షలు

Trending News