Renuka Chowdhury: నువ్వు ఎవడ్రా చెప్పడానికి... ఖమ్మం కార్యకర్తల మీటింగ్ లో శివాలెత్తిన రేణుక చౌదరీ.. వీడియో వైరల్..

Renuka Chowdhury: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రేణుక చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రరచ్చకు దారితీశాయి. అంతేకాకుండా.. మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 30, 2024, 06:54 PM IST
  • ఖమ్మం సభలో ఫైర్ అయిన ఎంపీ రేణుక చౌదరీ..
  • పరువు తీసుకున్నారంటున్న రాజకీయ విశ్లేషకులు..
Renuka Chowdhury: నువ్వు  ఎవడ్రా చెప్పడానికి... ఖమ్మం కార్యకర్తల మీటింగ్ లో శివాలెత్తిన రేణుక చౌదరీ.. వీడియో వైరల్..

Congress Senior Leader MP Renuka chowdhury fires on khammam congrees leaders: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన పరిణామం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లాలో కార్కకర్తల మీటింగ్ లో.. ఎంపీ రేణుక చౌదరి, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరీ మాట్లాడుతూ.. మండల ప్రెసిడెంట్లు అని మీటింగ్ లో ఎవరెవరో కూర్చున్నారు, అందరూ నాకు కనపడటం లేదు.. అన్ని ఏరియాస్ నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదని తనకు సమాచారం అందిందని అన్నారు. ఎన్నికల వేళ, ఇంత టఫ్ గా పోటీ జరుగుతున్న సమయంలో.. ఇంత నిర్లక్ష్యం చేయడం వీలు కాదు, పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు వేయడం, నాటకాలు చేయడం, మోసాలు మానేయండంటూ సభలో ఫైర్  అయ్యారు. అంతేకాకుండా.. కొందరు సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టుకుంటున్నట్లు కూడా రేణుక చౌదరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

మీకు పదవులు కావాలంటే ఏ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తామని రేణుక చౌదరీ అన్నారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రేణుక చౌదరీ మాటల పట్ల తీవ్రంగా తమ నిరసలను తెలియజేశారు. కొందరు కార్యకర్తలు రేణుకకు గట్టిగా కౌంటర్ ఇస్తు...మీరు ఇన్నీ రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వొచ్చి మాకు నీతులు చెప్తే ఎలా అని కార్యకర్త ప్రశ్నించారు. దీంతో రేణుక చౌదరీ తనదైన స్టైల్ లో శివాలెత్తిపోయారు.

నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. మొత్తంగా సభలో మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు. అక్కడే ఉన్న.. ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎంత నచ్చచెప్పిన కూడా కార్యకర్తలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

Read More: Bull fighting video: వామ్మో.. బట్టల షాపులోకి దూరి కుమ్ముకున్న ఎద్దులు.. వీడియో వైరల్..

కాంగ్రెస్ లో అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నయని మరోసారి రుజువైందని, అపోసిషన్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక పార్టీలు.. కాంగ్రెస్ పార్టీకి బైటవారు అవసరం లేదని, వారిలో వారే కొట్టుకుంటారని, ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అనేక సార్లు విమర్శించారు. సీఎం రేవంత్ సీటును లాక్కొవడానికి ఎంతో మంది కాచుకుని ఉన్నారని కేటీఆర్ బహింరంగానే అనేక మార్లు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ బలహీనమైన సీఎం అని, తన సీటు ఎక్కుడ పోతుందో అంటూ ఆయన అభద్రత భావంతో  ఉన్నాడంటూ కూడా బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News