ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆగని విద్యార్ధుల పోరు, తీవ్ర రూపం దాల్చుతున్న ఆందోళనలు

ఇంటర్ ఫలితాల అవకతవకలపై నాలుగో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Last Updated : Apr 24, 2019, 01:04 PM IST
ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆగని విద్యార్ధుల పోరు, తీవ్ర రూపం దాల్చుతున్న ఆందోళనలు

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు ఎదుట నాలుగు రోజు కూడా విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. బోర్డు తీరుపై తీవ్రంగా మడిపడుతున్న విద్యార్ధి సంఘాలు జిల్లా కేంద్రాల్లో నిరసనకు దిగాయి.

ప్రగతి భవన్ ముట్టడికి యత్నం...
ఇంటర్ మార్కుల అవకతవకలకు నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగాయి. భవనం మట్టడికి యత్నించిండంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలో పోలీసులు- విద్యార్ధి సంఘం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురు విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని  ఈటెల రాజేందర్ ఇంటిని విద్యార్ధులు ముట్టడించారు.దీంతో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి

విద్యార్ధుల న్యాయ పోరాటం

బోర్డు చేసిన తప్పిదం..అధికారుల నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్ధులకు శాపంగా మారింది. ఆ తప్పిందం వల్ల లక్షలాది మంది విద్యార్ధులు రోడ్డున పడ్డారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులు న్యాయం కావాలని కోరుతున్నారు. తమ సమస్యలను చెప్పుకుందామని ఇంటర్ బోర్డు వద్దకు వస్తే వినేవారు లేరు...దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత్యంతర లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది.

విద్యార్ధులకు కాస్త ఊరట...
విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో  ఇంటర్ బోర్డు కాస్త ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది.పరీక్షకు సంబంధించిన రీ వ్యాల్యూషేసన్  ఫీజు గడువు రెండు రోజుల పాటు పెంచింది. అలాగే సప్లిమెంటరీ ఫీజు గడవు ఈ నెల 27 వరకు పెంచింది. 

కోర్టు తీర్పుపై ఉత్కంఠత....
ఇంటర్ విద్యార్ధుల తరఫున కోర్టులో వాదిస్తున్న అడ్వకేట్ దామోదర్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు తప్పిందం వల్ల నష్టపోయిన విద్యార్ధులందరికీ ఉచితంగా రీ వ్యాల్యూయేషన్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోర్టును కోమారమన్నారు. సోమవారం వరకు విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Trending News