Telangana formationaday celerbrations 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేషన్స్ లకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకొవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more: Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలో.. జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ దగ్గరకు వెళ్తారు. అక్కడ.. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను ఈ ఉత్సవాలను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి పథకాలుకానీ, పథకం కోసం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం కానీ చేయకూడదు. ఎలాంటి ప్రబుత్వ పరంగా కార్యక్రమాలు చేయాల్సి ఉన్న ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఎలాగైన ఉత్సవాలను ఎప్పటికి గుర్తుండిపోయేలా గ్రాండ్ గా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది.
Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..
ఢిల్లీ కి చెందిన కాంగ్రెస్ హైకమాండ్ నాయకులను పిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలలో తమ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ ను ప్రజల్లో నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి కేవలం, తమ కుటుంబంలోని వారికే ఉద్యోగాలు వచ్చేలా చూసుకున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ కేంద్రంలో ఉండి తెలంగాణకు ఎలాంటి లాభం చేయలేదని, బీఆర్ఎస్, బీజీపీ ఎన్నికలలో లోపయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తరచుగా విమర్శలు చేస్తుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter