K Kavitha: 'రేవంత్ రెడ్డి' రివెంజ్‌, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే 'అల్లు అర్జున్‌' వివాదం

K Kavitha Hot Comments Allu Arjun Issue: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌, రివెంజ్‌ రాజకీయాలు నడుస్తున్నాయని రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే అల్లు అర్జున్‌ వివాదం అని పరోక్షంగా ప్రస్తావించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 23, 2024, 04:13 PM IST
K Kavitha: 'రేవంత్ రెడ్డి' రివెంజ్‌, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే 'అల్లు అర్జున్‌' వివాదం

Kavitha Vs Revanth Reddy: అధికారంలోకి ఏడాది గడిచినా ఇంకా రుణమాఫీ చేయలేదని.. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రతీకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. ప్రజల కోసం కాకుండా కొందరి కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. రైతులకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం ప్రతిపక్షాలను తిడుతున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కొద్ది పనులు పూర్తి చేస్తే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని గుర్తుచేశారు.

Also Read: CV Anand: అల్లు అర్జున్ అంశంలో విచక్షణ కోల్పోయిన పోలీస్ కమిషనర్.. మీడియా దెబ్బకు క్షమాపణలు

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి కార్యక్రమంలో పాల్గొని కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కనిపించిన మీడియాతో కవిత చిట్‌చాట్‌ చేశారు. అందులో భాగంగా కొన్ని అంశాలపై స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, అల్లు అర్జున్‌ గొడవ, తెలంగాణ విగ్రహం మార్పు వంటి అంశాలపై కవిత స్పందించారు.

Also Read: Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?

'పదేళ్లలో కేసీఆర్ ప్రపంచ బ్యాంకును రానివ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు నిధులు తెస్తన్నారు.. ఏం అవసరం వచ్చింది' అని కవిత ప్రశ్నించారు. 'కమ్యూనిస్టులు రెండు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులకు మాట్లాడకుండా ఉండటం మంచిది కాదు' అని హితవు పలికారు. తాము గ్రామాల్లోకి వెళ్తామని.. గ్రామగ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలను పెడతామని ప్రకటించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇప్పటి వరకు ఎవరికీ జరగడం లేదని ఆరోపించారు. గురుకులాలను కేసీఆర్ ప్రభుత్వం మంచిగా నడిపిందని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎట్లా ఇచ్చారు? అని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్.. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. 'మేము ప్రజల నుంచి వచ్చాం. అవసరం అనుకుంటే పదవులు వదిలేశాం' అని చరిత్రను కవిత గుర్తుచేశారు. ధరణి పేరు మార్పుపై స్పందిస్తూ.. 'భూభారతితో సెక్యూరిటీ లేకుండా పోతుంది. ధరణితో మేము సెక్యూరిటీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం ఎన్నికల రెఫరెండం అవుతుందో లేదో ప్రజలు తేలుస్తారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా మాట్లాడారు. ధరణితో 30 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు అప్లికేషన్లు రెండు లక్షలు వచ్చాయని అంటున్నారు' అని కవిత వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News