తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తుంగభద్ర పుష్కరాల ( Tungabhadra pushkaralu ) సందడి ప్రారంభమైంది. నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర నదీ పుష్కరాలకు ఏపీ ( AP ) , తెలంగాణ ( Telangana ) రాష్ట్రాల్లో ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి.
హిందూమతంలో..ముఖ్యంగా భారతదేశంలో నదీ పుష్కరాలకున్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యత ఎనలేనిది. గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. అలా ఒక్కోనదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వచ్చి..12 రోజుల పాటు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో నదీ పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ యేడాది నవంబర్ 20 నుంచి తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ , తెలంగాణలో భక్తుల సౌకర్యార్ధం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇటు తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) కూడా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అలంపూర్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నది పొడుగునా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం1:23 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయి.
తుంగభద్ర నదీతీరం వెంబడి అలంపూర్, కలుగోట్ల, పుల్లూరు, రాజోలి, వేణి సోంపురంలో పుష్కర్ ఘాట్లు ( Pushkar Ghats ) అందుబాటులో ఉన్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని..తుంగభద్ర పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పుష్కరాలపై సమీక్షించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈసారి తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మంత్రులు సూచించారు. Also read: Yadadri: యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసిఆర్ సమీక్ష