Harish Rao: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం తెలంగాణలో రైతుబంధు, రైతుభీమా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా.. బీజేపీ ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు విషయాలపై అవగాహనా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తు్న్నారని మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఏ పథకాలు అమలు చేస్తున్నారు, తెలంగాణ(Telangana)లోని జహీరాబాద్‌లో రైతులకు 24 గంటలు కరెంట్ అందుతుంటే.. పక్కన బీదర్‌లో రైతులకు కనీసం 6 గంటలు ఇవ్వని ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లిలో ఆదివారం జరిగిన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కనీసం 6 గంటలు కూడా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేని బీజేపీ నేతలు.. 24 గంటలు కరెంట్ ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
Also Read: SBI Cuts Interest Rates: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని అయినా పట్టించుకునే వారు లేరని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి సైతం రైతుల ఆత్మహత్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. రైతులు తిన్నది అరగక ఆత్మహత్య చేసుకుంటున్నారని చిల్లర మాటలు మాట్లాడటం నిజం కాదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో తెలుసుకుని, ఆ తర్వాత తెలంగాణ విషయాలు ప్రస్తావించాలని మంత్రి హరీష్ రావు(Harish Rao) సూచించారు.
Also Read: Telangana: ఆంధ్రా రైతుకు కేసీఆర్ ఫోన్..విందుకు ఆహ్వానం
రైతు కష్టాన్ని చూసిన వ్యక్తి కనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పథకాలు ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఈ నెల 27న రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన రైతుబంధు స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.6వేలు ఇవ్వడం ప్రారంభించిందన్నారు.
Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?
చెరువు కింద పంటలు సాగుచేస్తే వాటికి పన్నులు మాఫీ చేశామన్నారు. పన్నులను రద్దు చేయడంతో పాటు వారికి రూ.10వేల నగదును పంట సాగుకు ఇచ్చి సహకారం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రైతుబీమాకు రూ.1300 కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని మంత్రి హరీష్ రావు వివరించారు.
Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook