Auto Drivers Maha Dharna: అడ్డగోలు హామీలిచ్చి రైతులు, నేతన్నలు, మహిళలతోపాటు ఆటో డ్రైవర్లను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆటోలో ప్రయాణించి రాహుల్ గాంధీ ఫొటోలకు ఫోజిచ్చారు తప్ప అధికారంలోకి వచ్చాక ఏమీ చేయలేదని గుర్తు చేశారు. తీపి, మాయ మాటలు నమ్మి నట్టేటా మునిగారని చెప్పారు. పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడని ఏ ఒక్క వర్గం లేదని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇదే తీరున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Harish Rao: రేవంత్ పాలనలో 36 మంది విద్యార్థుల బలి.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆటో కార్మికుల సంఘాలు మంగళవారం మహా ధర్నా చేపట్టారు. వామపక్ష ఆటో సంఘాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆటో సంఘం కూడా ధర్నాకు మద్దతునిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఆటో డ్రైవర్ల మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఏనాడూ అనుకోలే. పదేళ్లలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవించాం. రోజుకు దాదాపు రూ.2 వేలు సంపాదించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూ.200 నుంచి 300 కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చింది' అని కేటీఆర్ గుర్తుచేశారు.
Also Read: KTR Letter: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ.. క్షమాపణ చెప్పాకే తెలంగాణలోకి రావాలని ఛాలెంజ్
'కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తెచ్చింది. దాదాపు 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. గతేడాది రాహుల్ గాంధీ వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని రంగుల కల చూపించారు. నెలకు రూ.వెయ్యి ఇస్తామని.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు' అని కేటీఆర్ వివరించారు. 'మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఇస్తానని చెప్పిన రూ.2,500 ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.
' 11 నెలల్లో వీళ్లు చెప్పిన దానికి చేసిన దానికి ఎంత తేడా ఉందో.. ఏం మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని ఆటో డ్రైవర్లను కోరుతున్నా. రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రేవంత్ పాలనలో పెరిగాయి. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వారి ఆత్మహత్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే రేవంత్ పట్టించుకోలేదు' అని కేటీఆర్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 'ఆటో డ్రైవర్లకు ఇస్తానని చెప్పిన నెలకు రూ.వెయ్యితో పాటు రూ.5 వేలు నెలకు ఇవ్వాలని కోరుతున్నా' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
'ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వచ్చే శాసనసభ సమావేశాల్లో ఏర్పాటు చేయాలి. మూడో పార్టీ బీమాను ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి' అని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి.. మీ నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. రాహుల్ గాంధీ చెప్పిన తియ్యని, కమ్మని మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరముందని గుర్తుచేశారు. 'సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డిని తన్నే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు భయం పట్టుకుంది' అని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని వాపోయారు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook