ఓటర్ల జాబితా పిటిషన్లపై హైకోర్టులో విచారణ

                  

Updated: Oct 5, 2018, 10:06 AM IST
ఓటర్ల జాబితా పిటిషన్లపై  హైకోర్టులో విచారణ

హైదరాబాద్: సుప్రీంకోర్టు సూచనల మేరకు ఓటర్ల జాబితా పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలు, ముసాయిదా జాబితా ప్రచురణ తేదీలకు సంబంధించి ధర్మసనం తమ నిర్ణయం చెప్పనుంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి ఓట్లర్ల జాబితాకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టు దృష్టికి రాగా ..ఈ  పిటిషన్లను ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదని..పిటిషనర్లు హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది. ఇదే సందర్భంలో ఈ పిటిషన్లను పరిశీలించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి  హైకోర్టు తగిన నిర్ణయం తీసుకోవాలని  స్పష్టం చేసింది. సుప్రీం సూచనల మేరకు ఈ పిటిషన్లను హైకోర్టు విచారణ చేపట్టనుంది.