Laxmi Kantha Rao Thota: కామారెడ్డి జిల్లా జుక్కల్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయినట్టు తెలుస్తోంది. జుక్కల్‌లో ఎమ్మెల్యే వర్సెస్- కాంగ్రెస్ క్యాడర్‌గా అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే భర్తీ చేశారు. ఆ పదవి విషయంలో మొదలైన రగడ ఏకంగా గాంధీభవన్ దాకా చేరింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నియోజకవర్గానికి చెందిన కొందరు లీడర్లు గాంధీ భవన్ మెట్లెక్కి ధర్నా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 2009 నుంచి గులాబీ జెండానే ఎగిరింది. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అక్కడి ప్రజలు గులాబీ పార్టీకి ఝలక్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ నేత ఎన్‌ఆర్‌ఐ తోట లక్ష్మీకాంతరావుకు పట్టం కట్టారు. అక్కడ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను లక్ష్మీకాంత రావును భారీ మెజారిటీతో ఓడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో జుక్కల్ నియోజకవర్గంలో కొలువుల జాతరకు ఎమ్మెల్యే తెరతీశారు. తాజాగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును భర్తీ చేశారు. అయితే పోస్టు కోసం చాలామంది లీడర్లు పోటీ పడటంతో ఆయన కొత్త పద్దతిలో చైర్మన్‌ను ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని మొత్తం షాక్ గురిచేసింది.
ఇటీవల జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మార్కెట్ పదవి ఎంపిక జరిగింది. మార్కెట్ చైర్మన్ పోస్టు ఎస్సీకి రిజర్వ్ కావడంతో.. చాలామంది లీడర్లు పోటీపడ్డారు. దాంతో వినూత్నంగా ఆలోచించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ పోస్టు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. ఇందులో 3 మండలాల కాంగ్రెస్ అధ్యక్షుడు, మరో ముగ్గురు సీనియర్‌లీడర్లకు కమిటీలో అవకాశం కల్పించారు. వీరిందరి సహకారంలో ఓ పరీక్ష పేపర్‌ను రెడీ చేశాక.. ఎగ్జామ్ నిర్వహించారు. అయితే ఈ ఎగ్జామ్‌కు దాదాపు 15 మంది నేతలు హాజరయ్యారు. అనంతరం ఇంటర్వ్యూ సైతం నిర్వహించినట్టు తెలిసింది. చివరకు జుక్కల్ మండలం పెద్ద ఎడ్డికి చెందిన అయిల్వార్ సౌజన్య ఎంపిక కావడంతో ఆమెకు మార్కెటింగ్ చైర్మన్ పోస్టును కట్టబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఆమె మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం కలిశారు. ఆమెను మంత్రి సైతం అభినందించారు. ఇక్కడే వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుకోసం చాలా మంది లీడర్లు కష్టపడ్డారు. వారందరి కష్టంతోనే ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచారు. దాంతో తమకు పదవులు వస్తాయని నేతలంతా భావించారు. కానీ వారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి. నామినేటేడ్ పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏంటని సొంత పార్టీ లీడర్లే ప్రశ్నిస్తున్నారట. తాము ఇన్నాళ్లు పడినా కష్టానికి పదవులు ఇవ్వాల్సింది పోయి.. ఎగ్జామ్‌లు, ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏంటని గుస్స అవుతున్నారట. అంతేకాదు మార్కెట్‌కమిటీ చైర్మన్ పోస్టు కోసం భారీ మొత్తంలో చేతులు మారినట్టు ఆరోపిస్తున్నారట. మరోవైపు తామే కష్టపడక పోతే ఎమ్మెల్యేకు ఆ పదవి వచ్చేదా అని మండిపడుతున్నారట. ఇకమీదట అయినా కేటాయించే పదవుల్లో కష్టపడిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
మొత్తంగా ఎమ్మెల్యే తీరుపై గుస్స అవుతున్న జుక్కల్ కాంగ్రెస్ లీడర్లు.. ఇకమీదట అయినా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ షాక్ తగిలే చాన్స్ ఉందని పార్టీ పెద్దలను విన్నవించారట. చూడాలి మరి కాంగ్రెస్ పెద్దలు తోట లక్ష్మీకాంతరావును పిలిచి మాట్లాడతారా. లేదంటే అలాగే వదిలేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..!
Also Read: MLC FIGHT: జీవన్‌కే మరో చాన్స్!
Also Read: Roja Selvamani: మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి