Harish Rao Strong Counter: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేతకాక రేవంత్ రెడ్డి తిట్ల పురాణం అందుకున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అని అభివర్ణించారు. మాట తప్పి పాలమూరు పేరు చెడగొడతున్నాడని తెలిపారు. వరంగల్ సభలో రేవంత్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.
Also Read: High Court: లగచర్ల ఘటనపై రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాదా? అని నిలదీత
మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి హరీశ్ రావు పాల్గొన్నారు. కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. 'కనబడ్డ దేవుడు మీద.. మసీదు మీద.. చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డిమాట తప్పాడు' అని గుర్తుచేశారు.
'పరిపాలన చేతకాక ఫ్రస్ట్రేషన్లో తిట్ల పురాణం మొదలుపెడతాడు. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. 'ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశా. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని' అని వివరించారు.
పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వాళ్లం. ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోం' అని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి' అని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి రూ.4 వేల కోట్లతో పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారని గుర్తుచేశారు.
'30 లక్షల నుంచి కోటి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసీఆర్ కృషి. కేసీఆర్ ఘనతను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు' అని హరీశ్ రావు తెలిపారు. 'కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం' అని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ.. విషయం తక్కువ. రేవంత్‌కి మాటలెక్కువ.. చేతలు తక్కువ' అని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter