High Court: లగచర్ల ఘటనపై రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ.. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాదా? అని నిలదీత

High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 20, 2024, 03:18 PM IST
High Court: లగచర్ల ఘటనపై రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ.. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాదా? అని నిలదీత

Patnam Narender Reddy: లగచర్ల ఘటనలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా? అలా ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని నిలదీసింది. లగచర్ల ఘటనలో అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు ఇచ్చిన నివేదికను తప్పుబట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

Also Read: Revanth Reddy Shock: రేవంత్‌ రెడ్డికి మూడో షాక్‌.. వరంగల్‌ పర్యటనకు మళ్లీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డుమ్మా

రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో జరిగిన రైతుల సంఘటర్షణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌, రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ పట్నం నరేందర్‌ రెడ్డి ఆర్డర్‌ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిపై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు హాట్‌హాట్‌గా కొనసాగాయి. నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. 'కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్ట్‌ చేశారు? మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది' అని న్యాయస్థానం నిలదీసింది.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌

'నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా? అని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దాడికి గురైన అధికారులకు తగిలిన గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక లేదని పేర్కొంది. తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి... చిన్న గాయాలైనట్లు రాశారని ప్రస్తావించింది. నరేందర్ రెడ్డి అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ దశలో పిటీషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిమాండ్‌ ఆర్డర్‌ను క్వాష్ చేయాలన్న పిటీషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

నరేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ లక్ష్మణ్, దేవేందర్, హన్మంత్ ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ధర్మాసనం ఆదేశించింది. వాదనలు ముగిసిన అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా కలెక్టర్‌ వచ్చిన సమయంలో అతడిని నిరసిస్తూ ఘెరావ్‌ చేశారు. ఈ సంఘటనకు కారకులుగా భావిస్తూ నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News