Krishna River Water Level: జూరాల డ్యాం ఫుల్.. ఉప్పొంగిన కృష్ణమ్మ..

Krishna River: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ డ్యామ్ లకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో డ్యామ్స్ అన్ని పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువన విడిచిపెట్టారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ దిగువన ఉన్ననారాయణ్ పూర్ నుంచి వరద నీరు జూరాల డ్యామ్ కు చేరుకుంటుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 18, 2024, 11:13 AM IST
Krishna River Water Level: జూరాల డ్యాం ఫుల్.. ఉప్పొంగిన కృష్ణమ్మ..

Krishna River: కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో  కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది.  భారీగా వస్తున్న వరద నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారమే ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయగా బుధవారం నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం నేటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆల్మట్టికి 81,333 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా ఉండగా.. 65 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు.
 
ఆల్మట్టి  డ్యామ్ కెపాసిటీ  పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 99 టీఎంసీలకు చేరకుంది.  నారాయణపూర్ జలాశయం పూర్తి కెపాసిటీ 33 టీఎంసీలుల కాగా, ప్రస్తుతం 31 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో వస్తుండగా.. 62,955 క్యూసెక్కుల నీటిని దిగివన జూరాలకు  వదులుతున్నారు.

జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.9 టీఎంసీల నీళ్లున్నాయి. ఎగువన కర్నాటక ప్రాజెక్టుల నుంచి కృష్ణ నదిలో వరద రావడంతో  బుధవారం సాయంత్రం జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు దగ్గర 7,500 క్యూసెక్కుల నీటిని వాడుకుంటూ ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.మొత్తంగా ఈ రెండు రోజుల్లో ఇదే ఫ్లో జూరాల ప్రాజెక్ట్ పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. జూరాల నిండితే.. అక్కడ నుంచి వరద నీరు..శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి ఇన్ ఫ్లో పెరిగే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News