Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందిస్తున్నారు. పార్టీ సమావేశాలతో పాటు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని సైతం టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ కు అదే స్థాయిలో కమలం పార్టీ నేతలు కౌంటరిస్తున్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కాంట్రాక్ట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. అవే నిధులను నల్గొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే బుధవారం మరోసారి అవే కామెంట్లు చేశారు కేటీఆర్. మాటంటే మాటనేన.. తాను చెప్పినట్లు కేంద్ర సర్కార్ చేస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. వరుస ట్వీట్లు చేసిన కేటీఆర్.. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాకు 18 వేల కోట్ల రూపా.ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.ఇప్పటికైనా మోడీ సర్కార్ నల్గొండ జిల్లాకు 18 వేల కోట్లు ప్రకటించాలని.. కన సవాల్ కు బీజేపీ సిద్దమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరిగినట్లు కాదని.. మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుడపదంటూ సెటైర్లు వేశారు. తమకు రాజకీయ ప్రయోజనం కాదు నల్గొండ జనం ముఖ్యం మోడీ గారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు
రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు
గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా?
— KTR (@KTRTRS) October 12, 2022
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించిన కేటీఆర్.. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ. 80,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు... మా తెలంగాణకు కనీసం రూ. 18,000 కోట్లు ఇవ్వలేరా? అంటూ ట్వీట్ లో ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు కేటాయించమని నీతిఆయోగ్ చేసిన సిఫార్సును పట్టించుకోలేదన్నారు. కాని రాజకీయ లబ్ది కోసం ఒక వ్యక్తికి మాత్రం రూ.18,000 కోట్ల కాంట్రాక్టు అప్పగించారని ఆరోపించారు.
Also Read : Munugode Bypoll: 40 ఎకరాలు ఆక్రమించిన కూసుకుంట్ల! ఆధారాలున్నాయంటున్న బీజేపీ.. మునుగోడు టీఆర్ఎస్ లో కలకలం
Also Read :unugode Bypoll Money: హైదరాబాద్ లో 10 కోట్ల డబ్బు సీజ్.. మునుగోడు కోసమే తెచ్చారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి